ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగిన ఆటోను ఢీకొన్న పాల వ్యాను

ABN, First Publish Date - 2021-04-17T05:08:13+05:30

మండల కేంద్రంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌ ఎదురుగా చిత్తూరు- కర్నూలు జాతీయ రహదారిపై శుక్రవారం ఆగిన ఆటోను పాల వ్యాను ఢీకొన్న ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి.

ప్రమాదంలో గాయపడిన వారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

11 మందికి గాయాలు

 

సంబేపల్లె, ఏప్రిల్‌ 16: మండల కేంద్రంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌ ఎదురుగా చిత్తూరు- కర్నూలు జాతీయ రహదారిపై శుక్రవారం ఆగిన ఆటోను పాల వ్యాను ఢీకొన్న ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు... రాయచోటి వైపు నుంచి వస్తూ ప్యాసింజర్‌ ఆటోను  డ్రైవర్‌ సంబేపల్లె ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద రోడ్డు సైడు నిలబెట్టాడు. అదే సమయంలో రాయచోటి వైపు నుంచి వస్తున్న పాల వ్యాను ఆటోను వెనుకవైపున బలంగా ఢీకొంది. దీంతో ఆటో డ్రైనేజీ కాలువను దాటుకొని ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న కొండావాండ్లపల్లెకు చెందిన నారాయణ, కృష్ణమ్మ, బోయపల్లెకు చెందిన వెంకటప్ప, రాయచోటి ఎస్‌ఎన్‌కాలనీకి చెందిన జైనాబీ, రెడ్డివారిపల్లెకు చెందిన నాగేంద్ర, శెట్టిపల్లె బండకాడ దళితవాడకు చెందిన నాగరాజు, వీరబల్లి మండలం పుత్తావాండ్లపల్లెకు చెందిన కళావతమ్మ, కంబళ్లవారిపల్లెకు చెందిన చిన్నవెంకట్రమణ, ఎర్రగుంట్లకు చెందిన కావలి వెంకటేష్‌కు గాయాలయ్యాయి. ఎస్‌ఐ రాజారమేష్‌ తన సొంత వాహనంలో క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 108 వాహనంలో మరికొంత మందిని తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-04-17T05:08:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising