ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెప్మా ఆర్పీ తొలగింపు తగదు

ABN, First Publish Date - 2021-09-18T05:03:31+05:30

మున్సిపాలిటీ పరిధి లోని 24 వవార్డు మెప్మా ఆర్పీ సోహెలాను తొలగించి ఆమె స్థానంలో పొదుపు గ్రూపు సభ్యురాలు కాని మరో మహిళ ను నియమించడం తగదని యాసిన్‌ మహిళా సమాఖ్యకు చెందిన 15 పొదుపు సంఘాల మహిళలు ఆక్షేపించారు.

సమావేశంలో చర్చిస్తున్న యాసిన్‌ మహిళా సమాఖ్య నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు అర్బన్‌, సెప్టెంబరు 17:  మున్సిపాలిటీ పరిధి లోని 24 వవార్డు మెప్మా ఆర్పీ సోహెలాను తొలగించి ఆమె స్థానంలో  పొదుపు గ్రూపు సభ్యురాలు కాని మరో మహిళ ను నియమించడం తగదని యాసిన్‌ మహిళా సమాఖ్యకు చెందిన 15 పొదుపు సంఘాల మహిళలు ఆక్షేపించారు. ఆమేరకు శక్రవారం 24 వార్డులోని మున్సిపల్‌ పార్కులో లో సమావేశమై ఆర్పీ ఎంపిక విషయంలో సమాఖ్య తీర్మానాలను పరిగణలోకి తీసుకోకుండా మెప్మా అధికారులు రాజకీయ  ఒత్తిళ్ళకు తలొగ్గి వేరే వార్డుకు చెందిన మహిళను నియమిం చటం సరైందికాదన్నారు. ఆర్పీ సోహెలా అనారోగ్యంతో కొద్ది రోజులుగా విధులకు హాజరుకాకపోవడంతో ఆమెను తొలగించటం సబబుకాదన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాల కార్యకలాపాలలో సమాఖ్య నియామకాల్లో రాజకీ య జ్యోక్యం ఉండటం మహిళల స్వయం నిర్ణయాధికారాలకు విఘాతం కలిగిస్తాయన్నారు. కొత్తగా నియమించిన ఆర్పీతో ఆసరాకు వేలిముద్రలు తీసుకొనే కార్యక్రమాన్ని బహిస్కరిస్తు న్నట్లు వారు స్పష్టం చేశారు. సోహెలాను విధుల్లోకి తీసుకో వాలని ఒకవేళ ఆమె అనారోగ్యంతో పనిచేయ లేకుంటే సమా ఖ్య సభ్యులనే ఆర్పీగా ఎన్నుకుంటామని తీర్మానించారు.

ఆర్పీ సెలవు పెట్టినట్లు  తెలియదు

ఈ విషయంపై మెప్మా అధికారిణి కెజియా జాస్మిన్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ఆర్పీ అనారోగ్యం పై ఉన్నట్లు మాకు ఎటువంటి సెలవు చీటి ఇవ్వలేదన్నారు. అందువల్ల వేరే వార్డుకు చెందిన వారిని పాలకమండలి పెద్దల సిఫార్సు తో ఆర్పీగా నియమించామన్నారు.  యాసిన్‌ మహిళా సమా ఖ్య ఆఫీస్‌ బేరర్స్‌ను 6 నెలలుగా సమాఖ్య బుక్కులు తనిఖీ చేయాలని సీఓ కోరితే చూపడంలేదన్నారు.  

Updated Date - 2021-09-18T05:03:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising