ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధ్యాహ్న భోజన కార్మికుల జీతాలు పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

ABN, First Publish Date - 2021-01-25T04:53:22+05:30

మధ్యాహ్న భోజన కార్మికుల జీతాలు, పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని చేయాలని ఏపీ మధ్యాహ్న భోజనం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌.చాంద్‌బాషా ప్రభుత్వాన్ని కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్రగుంట్ల, జనవరి 24: మధ్యాహ్న భోజన  కార్మికుల జీతాలు, పెండింగ్‌లో ఉన్న బిల్లులను  వెంటనే చెల్లించాలని చేయాలని ఏపీ మధ్యాహ్న భోజనం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  ఎస్‌.చాంద్‌బాషా  ప్రభుత్వాన్ని కోరారు. ఈ సంఘం సమావేశం ఆదివారం ఎర్రగుంట్లలో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీసం వేతనం రూ.18వేలు చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా సమానపనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కోడిగుడ్లు ప్రభుత్వమే పంపిణీ చేసి బిల్లులు యధావిధిగా ఇవ్వాలన్నారు. బిల్లులు ప్రతి నెల సక్రమంగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. స్కూల్‌ గ్రాంటులోనే వంట పాత్రలు అందించాలన్నారు. పీఎఫ్‌, బీమా పెన్షన్‌ సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో సునీత, వెంకట రమణమ్మ, హసీనాబీ, పార్వతమ్మ, వీరమ్మ, శివమ్మ, జరీనా గంగులయ్య కమల్‌బాష తదితరులను సంఘం కొత్త కార్యవర్గాన్ని ఎనున్నకున్నారు. 

Updated Date - 2021-01-25T04:53:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising