ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫోన్‌ కాల్‌ ఆధారంగా ఆచూకీ గుర్తింపు

ABN, First Publish Date - 2021-06-20T04:56:51+05:30

కడప నగరం రవీంద్రనగర్‌ చెందిన పఠాన్‌ మహబూబ్‌చాన్‌ అనే మహిళ, ఆమె చెల్లెలు తన పిల్లలతో కలిసి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిందని తాలుకా సీఐ నాగభూషణం తెలిపారు.

మహబూబ్‌చాన్‌, పిల్లలతో ఎస్‌ఐ హుసేన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తప్పిపోయిన భార్య, పిల్లల అప్పగింత


కడప (క్రైం), జూన్‌ 19 : కడప నగరం రవీంద్రనగర్‌ చెందిన పఠాన్‌ మహబూబ్‌చాన్‌ అనే మహిళ, ఆమె చెల్లెలు తన పిల్లలతో కలిసి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిందని తాలుకా సీఐ నాగభూషణం తెలిపారు. ఈ విషయమై తాలుకా పోలీసుస్టేషన్‌లో ఆమె బంధువులు ఫిర్యాదు చేయగా మహబూబ్‌చాన్‌ను వెదికి ఆమె భర్తకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. మహబూబ్‌ఛాన్‌ తన చెల్లెలు పిల్లలతో కలిసి మే 27న ఇంట్లో నుంచి వెళ్లిపోయిందన్నారు. దీనిపై ఆమె భర్త తాలుకా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని డీఎస్పీ ఆదేశాల మేరకు కొన్ని టీమ్‌లు ఏర్పాటై వెదకడం ప్రారంభిం చామన్నారు. ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా పశ్చిమ బెంగాల్‌లో ఇండియా-బంగ్లాదేశ్‌ బార్డర్‌లో గల ఉత్తర 24 పరగణాలు జిల్లా టాకీ  అనే గ్రామంలో ఆమె ఉన్నట్లు కనుగొన్నామన్నా రు. ఈనెల 14న తాలుకా స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ సుబ్బరాయుడు, కానిస్టేబుల్‌ జి.సుబ్బరాయుడులతో టీమ్‌గా ఏర్పడి అక్కడికి వెళ్లి ఆమెను కనుగొని వారిని తెచ్చి ఆమె భర్త కరీంకు అప్పగించామన్నారు. కాగా మహబూబ్‌చాన్‌ ఆచూకీ కనుగొని ఆమెను తీసుకుని రావడంలో కృషి చేసిన హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌లను డీఎస్పీ సునీల్‌, సీఐ నాగభూషణం, ఎస్‌ఐ హుసేన్‌లు అభినందించారు.

Updated Date - 2021-06-20T04:56:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising