ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంప్రదాయం ఉట్టి పడేలా...

ABN, First Publish Date - 2021-04-14T05:37:17+05:30

ఉగాది పండుగను పురస్కరించుకుని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌, జిల్లాలోని పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది సంప్రదాయ దుస్తులు ధరించారు.

చిన్నచౌకు పోలీసుస్టేషన్‌లో పంచెకట్టులో ఎస్పీ, సీఐలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంచెకట్టులో ఎస్పీ, పోలీసు అధికారులు


కడప(క్రైం), ఏప్రిల్‌ 13: ఉగాది పండుగను పురస్కరించుకుని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌, జిల్లాలోని పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది సంప్రదాయ దుస్తులు ధరించారు. మంగళవారం చిన్నచౌకు పోలీసుస్టేషన్‌లో కడప డీఎస్పీ సునీల్‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉగాది సంబరాలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఉగాదికి ఎంతో ప్రత్యేకం ఉందని, గ్రామాల్లో ఉత్సవాలు కన్నులపండువగా జరుపుకుంటున్నారన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. కరోనా వ్యాప్తి ఉన్న నేపధ్యంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు, శానిటైజర్లు వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డి, రిమ్స్‌ సీఐ నాగభూషణం, అర్బన్‌ సీఐ మహ్మద్‌ ఆలీ, ఎస్‌ఐ అమర్‌నాధరెడ్డి, సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో సీఐ సత్యనారాయణ, ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో సీఐలు శ్రీనివాసులరెడ్డి, శ్రీధర్‌నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - 2021-04-14T05:37:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising