ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమష్ఠి కృషితో కరోనాను నిర్మూలిద్దాం

ABN, First Publish Date - 2021-05-06T05:11:36+05:30

నియోజకవర్గస్థాయిలో అధికార యంత్రాంగం సమష్ఠి కృషితో కరోనాను నిర్మూలించవచ్చని ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి అన్నారు. బుధవారం కరోనా నివారణపై నియోజకవర్గంలోని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కమలాపురం(రూరల్‌), మే 5: నియోజకవర్గస్థాయిలో అధికార యంత్రాంగం సమష్ఠి కృషితో కరోనాను నిర్మూలించవచ్చని ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి అన్నారు. బుధవారం కరోనా నివారణపై నియోజకవర్గంలోని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా మండలాల వారీగా కరోనా పాజిటివ్‌ యాక్టివ్‌ కేసులు ఎన్ని ఉన్నాయి, ఎంత మంది చికిత్సలు పొందుతున్నారనే విషయాలపై ఆరా తీశారు. వలంటీర్లను అప్రమత్తం చేసి కరోనా నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఉపాధి పనుల వద్ద ఒక్క కూలికి కరోనా వచ్చినట్లు తెలిసినా పనులు నిలిపివేయాలని సూచించారు. ఎస్సీ కార్పొరేషన్‌ పీడీ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ఫాతిమా కళాశాల క్వారంటైన్‌కు తాను నోడల్‌ అధికారిగా ఉన్నానని, నియోజకవర్గంలో ఎక్కడైనా అత్యవసర కేసులు ఉంటే 9440166037 నెంబరుకు ఫోన్‌ చేయవచ్చన్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి చిన్నరాముడు మాట్లాడుతూ తాను 104కు నోడల్‌ అధికారిగా ఉన్నానని, ఏ సమస్య ఉన్నా 8008803123కు ఫోన్‌లో సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంకటసుబ్బయ్య, ఈవోపీఆర్‌డీ శారదమ్మ, ఆరు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వైద్యాధికారులు, నాయకులు ఉత్తమారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-06T05:11:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising