ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాల్వ్‌ ఫిట్‌ను వదిలేశారా ?

ABN, First Publish Date - 2021-03-01T04:57:34+05:30

వాల్వ్‌ ఫిట్‌ను వదిలేశారా ?

రోడ్డు పక్కనే మూత లేకుండా ఉన్న వాల్వ్‌ ఫిట్‌ గుంత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చస్తే కానీ స్పందించరా.. 

ప్రమాదకరంగా రోడ్డు పక్కనే నాలుగడుగుల గుంత


అధికారుల నిర్లక్ష్య ధోరణి, పట్టించుకోని పంచాయతీతో ఏడాదిగా వాల్వ్‌ ఫిట్‌ను అలాగే వదిలేశారు. రోడ్డు పక్కనే ఈ నాలుగు అడుగుల గుంత ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు ఆడుకుంటూ ఉంటారని పొరపాటున ఆ గుంతలో పడితే ఎలా అంటూ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  వివరాలిలా..


చెన్నూరు, ఫిబ్రవరి 28: చెన్నూరు కేవోఆర్‌ కాలనీలో రోడ్డు పక్కనే వాల్వ్‌ ఫిట్‌ (పైపులైను కనెక్షన్‌ ఒక వీధి నుంచి మరో వీధికి మళ్లించడం) ప్రమాదకరంగా ఉండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదైనా దీనిపై మూత వేయకుండా అలాగే వదిలేశారు. ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు జవాబుదారి అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిసరాల్లో చిన్నారులు ఆడుకుంటూ ఉంటారని, ఏదైనా ప్రాణనష్టం జరిగితే కానీ స్పందించరా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే దారిలో సామాజిక ఆరోగ్య కేంద్రం, సాంఘిక సంక్షేమ వసతిగృహం, చిన్నపిల్లల పాఠశాల, నిత్యం వ్యవసాయానికి రైతుల రాకపోకలు ఉంటాయి. ఈ దారిలో పక్కనే వాల్వ్‌ ఫిట్‌ ఉండడం, స్థానికులతో పాటు ఆ దారిన తిరిగే వారిని ఇబ్బందులు పెడుతూ భయపెడుతోంది. ఇటీవల నలుగుదైరుగురు చిన్నారులు కూడా గుంతలో పడిన సంఘటనలున్నాయని స్థానికులు చెబుతున్నారు.  ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోరేం ? వాల్వ్‌ఫిట్‌కు మూత వేసేందుకు డబ్బుల్లేవా ? గ్రామ పంచాయతీ ఇంత అధ్వాన స్థితిలో ఉందా అని ప్రజలు మండిపడుతున్నారు. 


పట్టి ంచుకుంటే కదా ?

ఏడాది కిందట ఈ కనెక్షన్‌ ఏర్పాటు చేశారు. అప్పట్లో ప్రజలు త్వరగా వాల్వ్‌ ఫిట్‌పై మూత వేయాలని కోరారు. ఇదే విషయం పలుమార్లు మేము చెప్పాం. అయినా ఫలితం లేదు. పిల్లలు, ముసలి వారు ఈ దారిన వెళుతుంటారు. ఏదైనా జరిగితే ఎవరిని అడగాలి. ఇంత పెద్ద మేజరు పంచాయతీలో చిన్న పనులు కూడా చేయలేకపోతే ఎలా. 

         - గాంధీరెడ్డి, కేవోర్‌ కాలనీ


త్వరగా మూత వేయిస్తా

వాల్వ్‌ఫిట్‌ ఏర్పాటు చేసినప్పుడు మూత వేయాలని పంచాయతీ సిబ్బందికి చెప్పాం. త్వరలోనే వేస్తారు. ఇంతవరకు అయితే ఏ ఇబ్బందులు కలగలేదు. అయినా మూత వేయించాల్సిన బాధ్యత మాపై ఉంది. ఆలస్యం కాకుండా పూర్తి చేయిస్తాం. ప్రజలు కూడా పలుమార్లు చెప్పారు. ఇక ఆలస్యం చేయము.

         - గురురాజ ప్రసాద్‌, ఏఈ, ఆర్‌డబ్ల్యుఎస్‌ 

Updated Date - 2021-03-01T04:57:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising