ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాలి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-09-19T05:41:51+05:30

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కలెక్టర్‌ విజయరామరాజు సూచించారు. శనివారం సాయంత్రం స్థానిక ఎంపీడీఓ సభాభవనంలో ఏర్పాటు చేసిన ఎన్నికల లెక్కింపు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.

కమలాపురం ఎన్నికల కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ విజయరామరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కమలాపురం రూరల్‌ / వల్లూరు , సెప్టెంబరు 18: ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కలెక్టర్‌ విజయరామరాజు సూచించారు. శనివారం సాయంత్రం స్థానిక ఎంపీడీఓ సభాభవనంలో ఏర్పాటు చేసిన ఎన్నికల లెక్కింపు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లెక్కింపు కేంద్రాన్ని శానిటైజర్‌తో శుభ్రం చేయాలని, కేంద్రం చుట్టుపక్కల నీళ్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పోలీసులు కేసులున్న వారిని ఏజెంట్లుగా అనుమతించరాదన్నారు. ఏజెంట్లు, అధికారులు, సిబ్బంది కొవిడ్‌ పరీక్షలు తప్పక చేయించుకోవాలని అన్నారు. సా్ట్రంగ్‌రూము నుంచి పోలింగ్‌ పెట్టెలను లెక్కింపు కేంద్రానికి తీసుకెళ్లేటప్పుడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వీడియో గ్రాఫర్‌ను కూడా ఏర్పాటు చేసి అందరి సమక్షంలో బాక్సులు తీసుకురావాలని అన్నారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభించి 11 గంటలకు ముగిసే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. లెక్కింపు పూర్తవగానే ఆర్వో వెంకటసుబ్బయ్య ఫలితాలు ప్రకటిస్తారన్నారు. కాగా.. అంతకు ముందు వల్లూరు ఎంపీడీవో సభాభవనంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రాన్ని కలెక్టర్‌ విజయరామరాజు పరిశీలించారు. కలెక్టర్‌ వెంట ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి, డ్వామా పీడీ యధుభూషణ్‌రెడ్డి తదితరులున్నారు.

Updated Date - 2021-09-19T05:41:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising