ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశ్నిస్తే చంపేస్తారా ?

ABN, First Publish Date - 2021-07-29T04:49:51+05:30

రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాల గురించి ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ కడప అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ వీఎస్‌ అమీర్‌బాబు ప్రశ్నించారు. బుధవారం నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కృష్ణా జిల్లా బి.కోడూరు మండలం గడ్డమనుగు గ్రామం వద్ద జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను పరిశీలించేందుకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమాపై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

విలేకర్లతో మాట్లాడుతున్న అమీర్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప, జూలై 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాల గురించి ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ కడప అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ వీఎస్‌ అమీర్‌బాబు ప్రశ్నించారు. బుధవారం నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కృష్ణా జిల్లా బి.కోడూరు మండలం గడ్డమనుగు గ్రామం వద్ద జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను పరిశీలించేందుకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమాపై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజా సంపదను దోచుకోవడాన్ని అడ్డుకుంటే హత్యాయత్నానికి పాల్పడతారా అంటూ ప్రశ్నించారు. కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డి, ప్రధాన కార్యదర్శి జయకుమార్‌, అధికార ప్రతినిధి బాలదాసు, రవిశంకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


అక్రమ అరెస్టు దారుణం

కమలాపురం(రూరల్‌), జూలై 28: టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును వైసీపీ నేతలు కారును అడ్డగించుకుని దాడులు చేసి కారు అద్దాలు ధ్వంసం చేయడం సిగ్గుచేటని టీడీపీ జిల్లా ముస్లిం మైనార్టీ నాయకుడు ఖాదర్‌బాష, జిల్లా బీసీ సెల్‌ ఉపాధ్యక్షుడు గండి నారాయణ అన్నారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో వారు మాట్లాడారు. కార్యక్రమంలో మండల తెలుగు యువత నాయకుడు చిన్నసుబ్బారెడ్డి, మండల నాయకులు శంకర్‌యాదవ్‌, మల్లేష్‌, బాలిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డిలు పాల్గొన్నారు.


దేవినేని ఉమాపై దాడి దుర్మార్గం

చెన్నూరు, జూలై 28: దేవినేని ఉమాపై వైసీపీ నేతలు దాడి చేయడం దుర్మార్గమని టీడీపీ జిల్లా పార్లమెంటరీ అధికార ప్రతినిధి మన్నూరు అక్బర్‌ అన్నారు. చెన్నూరులో బుధవారం మాట్లాడుతూ వైసీపీ నేతల అవినీతి, అక్రమాలు బయట పడతాయని దాడి చేయడం పిరికిపంద చర్య అన్నారు. 

Updated Date - 2021-07-29T04:49:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising