ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీమకు ద్రోహం చేస్తున్న జగన

ABN, First Publish Date - 2021-07-25T06:13:04+05:30

దివంగత ఎన్టీఆర్‌ రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు తెలుగుగంగతో సహా ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని, రాయలసీమలో పుట్టిన జగన తాగునీటి విషయంలో సీమకు తీరని ద్రోహం చేస్తున్నారని టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి అన్నారు.

టీడీపీ కార్యాలయంలో కడప పార్లమెంటరీ కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న లింగారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్రం చేతుల్లోకి ప్రాజెక్టులు

కడప పార్లమెంటరీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో లింగారెడ్డి

కడప, జూలై 24 (ఆంధ్రజ్యోతి): దివంగత ఎన్టీఆర్‌ రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు తెలుగుగంగతో సహా ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని, రాయలసీమలో పుట్టిన జగన తాగునీటి విషయంలో సీమకు తీరని ద్రోహం చేస్తున్నారని టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నూతనంగా ప్రకటించిన కడప పార్లమెంటు కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల ప్రతినిధులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాజెక్టులన్నీ కేంద్రం తన చేతుల్లోకి తీసుకున్నా జగన స్పందించకపోవడం దారుణమన్నారు. నీటి విషయంలో జగన మాట్లాడకుండా మౌనంగా ఉండి రాయలసీమ వాసులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. దివంగత వైఎ్‌సఆర్‌ కూడా సీమకు మిగులు జలాలు అక్కరలేదని బ్రిజేష్‌ కమిటీకి చెప్పాడని గుర్తు చేశారు. పార్టీలో చురుగ్గా పనిచేసే కార్యకర్తలకే చంద్రబాబు, లోకేశ పదవులు ఇచ్చారన్నారు. అందరూ కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్ధనరెడ్డి, హరిప్రసాద్‌, అసెంబ్లీ ఇనచార్జిలు అమీర్‌బాబు, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఓబులాపురం రాజశేఖర్‌, మీడియా కోఆర్డినేటర్‌ జనార్ధన, కడప నగర అధ్యక్షుడు శివకొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T06:13:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising