ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ పాలనంతా అరాచకమే...

ABN, First Publish Date - 2021-03-08T04:42:32+05:30

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాలనంతా అరాచకంగా మారింద ని, ఈ రెండెళ్ళలో చేసిన అభివృద్ధి మాత్రం శూన్యమని టీడీపీ పోలీట్‌ బ్యూరో సభ్యు డు, రాజంపేట టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి ప్రభుత్వంపై విరుచుకపడ్డారు.

మాట్లాడుతున్న టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌శ్రీనివాసరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండెళ్ళలో అభివృద్ధి శూన్యం

టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాస రెడ్డి


గాలివీడు, మార్చి 7: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాలనంతా అరాచకంగా మారింద ని,  ఈ రెండెళ్ళలో చేసిన అభివృద్ధి మాత్రం శూన్యమని టీడీపీ పోలీట్‌ బ్యూరో సభ్యు డు, రాజంపేట టీడీపీ  పార్లమెంట్‌ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. ఆదివారం తూముకుంట సర్పంచ్‌ రవికుమార్‌ నాయుడు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ రమే్‌షకుమార్‌ రెడ్డితో కలసి పాల్గొన్నారు. ఆర్‌ఆర్‌ సోదరులను సర్పంచ్‌ ఘనంగా సన్మానించారు. ఈ సంద్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు బరితెగించి పురపాలక ఎన్నికలలో నామినేషన్‌ వేసిన టీడీపీ వారిని బెదిరించి ఏకగ్రీవాలకు పాల్పడడం చూస్తే  ప్రజాసామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు.  వైసీపీ ప్రలోబాలకు, బెదిరింపులకు టీడీపీ కార్యకర్తలు లోను కాకుండా మనోధైర్యంతో స్ధానిక సంస్ధల ఎన్నికలలో పోటీ చేయడంతో వారిలో వణుకు మొదలైందన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన ప్రతి కార్యకర్తను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇలాంటి అరాచకపు ప్రభుత్వానికి గుణపాఠం చేప్పేరోజులు దగ్గర పడ్డాయన్నారు. కార్యక్రమంలో పూలకుంట సర్పంచ్‌ పార్థసారధిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు ప్రభాకర్‌నాయుడు, నాగశేషారెడ్డి, మాజీ సర్పంచ్‌లు భద్రప్పనాయుడు, మహ్మద్‌రియాజ్‌, చిన్నప్పరెడ్డి, మాజీ వక్క్ఫ్‌బోర్డ్‌ మెంబర్‌ మహబూబ్‌బాష, జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి వెంకటశివారెడ్డి, నూలివీడు మాజీ సొసైటీ అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి(బుల్లెట్‌), టీడీపీ నాయకులు రాంమోహన్‌నాయుడు, శ్రీకాంత్‌రెడ్డి, బీకెనాయక్‌, శివప్పనాయుడు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-08T04:42:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising