ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధితులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత

ABN, First Publish Date - 2021-06-17T05:34:45+05:30

కరోనా బాధితులను ఆదుకోవడం ప్రభుత్వ బాఽధ్యత అని, కరోనాతో మరణించిన వారికి సర్టిఫికెట్‌ ఇచ్చే విషయంలో రాజకీయం చేయవద్దని టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

కడపలో తహశీల్దారుకు వినతిపత్రం ఇస్తున్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా మృతుల కుటుంబాలకు వెంటనే రూ.10 లక్షలు ఇవ్వాలి

తహసీల్దారుకు వినతిపత్రాల ఇచ్చిన టీడీపీ నేతలు

కడప, జూన 16 (ఆంధ్రజ్యోతి): కరోనా బాధితులను ఆదుకోవడం ప్రభుత్వ బాఽధ్యత అని, కరోనాతో మరణించిన వారికి సర్టిఫికెట్‌ ఇచ్చే విషయంలో రాజకీయం చేయవద్దని టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు బుధవారం ఆ పార్టీ నేతలు మండల తహశీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కడపలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్ధనరెడ్డి, హరిప్రసాద్‌ మాట్లాడుతూ వివిధ రాషా్ట్రల్లో కొవిడ్‌ ఆర్థిక ప్యాకేజీ కొన్నివేల కోట్లు ప్రకటించారని, ఏపీలో మాత్రం చిల్లిగవ్వ ప్రకటించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెయ్యి రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లుగా గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. చంద్రన్న బీమా కొనసాగించి ఉండింటే కరోనాతో మరణించిన కుటుంబాలకు రూ.10లక్షలు వచ్చి ఉండేవన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు జిలానీబాషా, ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్‌ మాజీ సభ్యుడు పోతుగంటి పీరయ్య, మాజీ వైస్‌ చైర్మన సుధాకర్‌యాదవ్‌, టీడీపీ ఉపాధ్యక్షుడు గన్నేపాటి మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు. సింహాద్రిపురం తహసీల్దార్‌ మహబూబ్‌బాషాకు ఎమ్మెల్సీ బీటెక్‌ రవి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆక్సిజన మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించి వారి కుటుంబాలకు రూ.25లక్షలు పరహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కరోనా దెబ్బతో వ్యవసాయ రంగం కుదేలైందని, ఈ క్రమంలో రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. అన్నా క్యాంటీన్లు తిరిగి తెరిపించి పేదల కడుపు నింపేలా చూడాలన్నారు. కరోనా మృతుల దహన సంస్కారాలకు ప్రకటించిన రూ.15వేలు ఆర్థికసాయం సకాలంలో అందించాలని డిమాండు చేశారు. రాజంపేట తహశీల్దారు రవిశంకర్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చిన అనంతరం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్‌రాయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా అనేక మంది అమాయకులు కరోనాతో ప్రాణాలు వదిలారన్నారు. వీరి కుటుంబాలకు తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు మహిళాధ్యక్షురాలు అనసూయమ్మ, టీడీపీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి చెన్నూరు సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-17T05:34:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising