ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలులో అక్రమాలను అరికట్టాలి

ABN, First Publish Date - 2021-06-04T05:09:42+05:30

ధాన్యం కొనుగోలులో అక్రమాలను అరికట్టాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు అంబటి క్రిష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం సివిల్‌ సప్లైస్‌ డీఎం శివపార్వతిని అంబటి క్రిష్ణారెడ్డి కలిసి వివరించారు.

డీఎం శివపార్వతితో మాట్లాడుతున్న అంబటి క్రిష్ణారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సివిల్‌ సప్లైస్‌ డీఎంను కలిసిన అంబటి క్రిష్ణారెడ్డి

కడప(రూరల్‌), జూన్‌ 3: ధాన్యం కొనుగోలులో అక్రమాలను అరికట్టాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు అంబటి క్రిష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం సివిల్‌ సప్లైస్‌ డీఎం శివపార్వతిని అంబటి క్రిష్ణారెడ్డి కలిసి వివరించారు. వరిధాన్యం కొనుగోలులో జరుగుతున్న అక్రమాలను అధికారి దృష్టికి తెచ్చారు. జూన్‌ 2వ తేదీన బద్వేల్‌ నియోజకవర్గంలోని పోరుమామిళ్ల, కలసపాడు మండలాలలోని పలు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం తూకాలను పరిశీలించామని, అక్రమాలు జరుగుతున్నట్లు రైతులు తమదృష్టికి తెచ్చారన్నారు. పైగా రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలుదారులు ఏవేవో సాకులు చెబుతూ నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేస్తున్నారన్నారు. వీటిన్నిటిపై తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా డీఎం శివపార్వతి మాట్లాడుతూ ఇక మీదట ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ గౌతమికి కూడా పై విషయాలనే ఫోన్‌ ద్వారా వివరించారు. 

Updated Date - 2021-06-04T05:09:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising