ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెంచిన పెట్రోలు, గ్యాస్‌ ధరలు తగ్గించాలి

ABN, First Publish Date - 2021-02-27T04:50:18+05:30

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ నేతలు డిమాండ్‌ చేశారు.

ఎర్రగుంట్లలో డీటీకి వినతిపత్రాన్ని అందజేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్రగుంట్ల, ఫిబ్రవరి 26: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ నేతలు  డిమాండ్‌ చేశారు. ఆమేరకు ఎర్రగుంట్లలో సీపీఐ ఆధ్వర్యంలో  పెంచిన డీజల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలను నిరసిస్తూ శుక్రవా రం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్‌డౌన్‌తో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో ప్రజానికంపై మోయలేని ఇంధన ధరల భారం మోపడం బాధాకరమన్నారు. వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అనంతరం డీటీకి వారొక వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంవీసుబ్బారెడ్డి, నారా యణ, రాధాక్రిష్ణ పాల్గొన్నారు. 

జమ్మలమడుగులో..

జమ్మలమడుగు రూరల్‌, ఫిబ్రవరి 26: పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించాలని సీపీఐ నాయకులు జమ్మలమడుగులో  శుక్రవారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు డిప్యూటీ తహసీల్దారు తేజశ్వనికి  వారొక వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సమితి సభ్యుడు ప్రసాదు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరగడం వలన పేద, మధ్య తరగతి ప్రజలపై పెనుభారం పడిందన్నారు.   కార్యక్రమంలో సీపీఐ నాయకులు లాల్‌బాష, ఎఐటీయూసీ నాయకులు రాజు, రంగనాయకులు, గోపాల్‌, లోకేష్‌, తదితరులు పాల్గొన్నారు.

 కొండాపురంలో..

కొండాపురం, ఫిబ్రవరి 26: కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను మానుకోవాలని బైపాస్‌ రోడ్డుపై సీపీఐ నాయ కులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి మనోహర్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిరోజు పెట్రోల్‌, డీజల్‌ పెరగడంతో పాటు నిత్యావసర ధరలు పెరగడం వల్ల పేద, బడుగు, బలహీన వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే కేంద్ర ప్రభు త్వం పెట్రోల్‌, డీజల్‌ తగ్గించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిష్మా, భాస్కర్‌, శివశంకర్‌, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందించారు. 

Updated Date - 2021-02-27T04:50:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising