ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెంచిన పెట్రో ధరలు వెంటనే తగ్గించాలి

ABN, First Publish Date - 2021-06-19T05:06:40+05:30

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి సుబ్బరాయుడు డిమాండ్‌ చేశారు.

ఽప్రొద్దుటూరులో పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న సీపీఐ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు టౌన్‌, జూన్‌ 18: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి సుబ్బరాయుడు డిమాండ్‌ చేశారు. ధరల పెంపుదలకు నిరసనగా శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో పుట్టపర్తి సర్కిల్‌లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 2 నుంచి ఇప్పటి వరకు 21సార్లు పెట్రోలు, డీజి ల్‌ ధరలు పెంచారని, దేశ చరిత్రలో ఒకే నెలలో ఇన్నిసార్లు ధరలు ఏ ప్రభుత్వం పెంచలేదని  ధ్వజమెత్తారు. జమాతే ఇస్లామి హింద్‌ పట్టణాధ్యక్షుడు ఎన్‌ఎ్‌సమొహిద్దీన్‌ మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో పనులు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఇంధన ధరలు పెం చడం దారుణమన్నారు.  ఆమ్‌ఆద్మీ పార్టీ ఇన్‌ఛార్జి పీజాదస్తగీర్‌, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ డివిజన్‌ కార్యదర్శి షరీఫ్‌, జనసేన నాయకుడు జిలానీ, సీపీఐ పట్టణ కార్యదర్శి నరసింహ, నాగరాజు, ఏఐటీయూసీ నాయకుడు యేసోబు, కిరణ్‌, దౌలా, ఏఐఎ్‌సఎఫ్‌ నాయకులు ఓబులేసు, శివ  పాల్గొన్నారు.

రాజుపాళెంలో..

రాజుపాళెం, జూన్‌ 18:  నెల రోజులుగా పెట్రోలు ధరలు పెరుగుతుండడంతో పేదలపై పెనుభారమవుతోందని  సీపీఐ నేతలు ధ్వజమెత్తారు. ఆ మేరకు సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం రాజుపాళెంలోని తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దారుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకుడు నాగరాజు మాట్లాడుతూ లీటరు పెట్రోలు ధర రూ.102కు చేరిందని, దీంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా మండిపోతున్నాయన్నారు. ప్రభుత్వం స్పందించి డీజిల్‌, పెట్రోలు ధరలు తగ్గించాలని వారు కోరారు.

కొండాపురంలో..

కొండాపురం, జూన్‌ 18: పెట్రోల్‌, డీజల్‌ ధరలు వెంటనే తగ్గించాలని సీపీఐ నేతలు డిమాండ్‌ చేశారు. ఆమేరకు శుక్రవారం  స్థానిక బైపా్‌సరోడ్డుపై పెట్రోల్‌, డీజల్‌ ధరలతో పాటు నిత్యావసర ధరలను తగ్గించాలని కోరుతూ సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డీటీ బాలకృష్ణకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి మనోహర్‌బాబు, ఏఐటీయూసీ నాయకులు చిన్నా, విద్యాసాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-19T05:06:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising