ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరుగుతున్న బాధితులు

ABN, First Publish Date - 2021-04-17T04:43:20+05:30

నియో జకవర్గ పరిధిలో కొవిడ్‌ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది

నక్కలదిన్నెపల్లెలో పర్యటిస్తున్న తహసీల్దార్‌, వైద్యాధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆస్పత్రిలో బెడ్లు, ఆక్సిజన ఏర్పాటు

నక్కలదిన్నెపల్లెలో 14 మందికి కరొనా

పులివెందుల రూరల్‌, ఏప్రిల్‌ 16: నియో జకవర్గ పరిధిలో కొవిడ్‌ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బాధితులకు వైద్యం అందిం చేందుకు పులివెందుల ఏరియా ఆస్పత్రి లో 10 బెడ్లు, ఆక్సిజనతో గదిని ఏర్పాటు చేస్తున్నారు. సెకండ్‌ వేవ్‌లో పులివెందు లలో వంద కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 70 వరకు యాక్టివ్‌గా ఉన్నా యి.

కాగా టెస్టు చేయించుకునేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. అయితే శాంపిల్స్‌ ఇచ్చిన వారు ఫలితం వచ్చే వ రకు ఐసొలేషనలో ఉండాలని  పులివెం దుల ఏరియా ఆస్పత్రి సూపరింటెండెం ట్‌ మధుసూదనరెడ్డి తెలిపారు. ఒకవేళ అప్పటికే వైరస్‌ సోకి ఉంటే నిర్లక్ష్యంగా వ్యవహరించరాదు. వైరస్‌ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మాస్కు తప్పకుం డా వినియోగించాలన్నారు.

నక్కలదిన్నెపల్లెలో....

చక్రాయపేట, ఏప్రిల్‌ 16: కె రాజుపల్లె గ్రామం నక్కలదిన్నెపల్లెను కరోనా కమ్ము కుంది. ఇటీవల బెంగుళూరు నుంచి ఒక వ్యక్తి గ్రామానికి రావడం, ఆ వ్యక్తి మృతిచెందాడు. ఇటీవల ఆయనను కలి సిన వారిలో 14 మందికి కరోనా నిర్దార ణ అయింది. శుక్రవారం తహసీల్దార్‌ వైఎస్‌ సత్యానందం, వైద్య సిబ్బంది, అధి కారులు గ్రామాన్ని సందర్శించి మెడికల్‌ క్యాంప్‌ నిర్వహించారు.

12 మందిని హోం క్వారంటైనకు తరలించారు. ఇద్దరి ని కదిరి వైద్యశాలలో చేర్చారు. వారిలో ఒకరు గండి ప్రాంతంలో ఒక హోటల్‌కు రావడంతో గండి ప్రాంతీయులు భయ బ్రాంతులకు గురవుతున్నారు. గండిలో సహాయ కమిషనర్‌ ముకుందరెడ్డి ఆ హోటల్‌ను మూయించి ప్రజలను, భక్తు లను అలర్ట్‌ చేయించారు. పోలీసులకు వైద్యసిబ్బందికి తెలియజేశారు. ఏదిఏ మైనా చక్రాయపేట మండలంలో కరోనా కలకలం రేపుతోంది. ప్రజలు తప్పక మాస్కులు ధరించాల్సి ఉంది.

Updated Date - 2021-04-17T04:43:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising