ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాయచోటి మునిసిపాలిటీలో 28 వార్డులు ఏకగ్రీవం

ABN, First Publish Date - 2021-03-03T04:47:39+05:30

రాయచోటి మునిసిపాలిటీలోని 34 వార్డులకు గానూ మంగళవారం రోజుకు 28 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఈ వార్డులలో కేవ లం ఒక నామినేషన్‌ మాత్రమే మిగిలిఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిగిలింది 6 వార్డులే 

మునిసిపాలిటీ వైసీపీ వశం

రాయచోటి, మార్చి 2 : రాయచోటి మునిసిపాలిటీలోని 34 వార్డులకు గానూ మంగళవారం రోజుకు 28 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఈ వార్డులలో కేవ లం ఒక నామినేషన్‌ మాత్రమే మిగిలిఉంది. ఇప్పటికి 6 వార్డుల్లో మాత్రమే ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు ఉన్నాయి. నామినేషన్ల ఉప సంహరణ తొ లిరోజు (మంగళవారం) 15 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

బుధవా రం కూడా నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు గడువు ఉంది. ఈ నేపధ్యంలో మిగిలిన 6 వార్డుల్లో కూడా ఎన్ని నామినేషన్లు ఉంటాయో చూ డాల్సిందే. ప్రస్తుతం 1వ వార్డులో 7 నామినేషన్లు, 20లో 2, 23లో 3, 24లో 7, 25లో 5, 27వ వార్డులో 3 నామినేషన్లు ఇంకా ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఏకగ్రీవం అయిన వార్డులన్నీ.. అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభ్యర్దేలే.  ఎన్నికలు పూర్తి కాక ముందే.. మునిసిపాలిటీ పీఠాన్ని అధికార పార్టీ కైవ సం చేసుకుంది. 

రెండు సెట్ల నామినేషన్ల దాఖలు

గత ఏడాది నామినేషన్ల సందర్బంగా అధికార పార్టీ నాయకులు దౌర్జన్యం చేసి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారని 20వ వార్డు, 31 వ వార్డు తెలుగుదేశం నాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన  విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో తిరిగీ నామినేషన్లను వేసుకోవడానికి ఎ న్నికల సంఘం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో మంగళవారం 20వ వార్డుకు తెలుగుదేశం పార్టీ తరపున కొట్టె వెంకట చలపతి రెం డు సెట్ల నామినేషన్‌ను దాఖలు చేశారు. 31వ వార్డుకు నామినేషన్‌ దాఖలు చేయలేదు. 

Updated Date - 2021-03-03T04:47:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising