ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బలవంతపు ఉపసంహరణలను ఉపేక్షించం

ABN, First Publish Date - 2021-03-01T04:47:10+05:30

పురపాలక సంఘం ఎన్నికలకు సంబంధించి ఎవరైనా, ఏ పార్టీ వారైనా అభ్యర్థులను బెదిరించి బలవంతపు ఉపసంహరణలకు పాల్పడితే, అలాం టి వాటిని ఉపేక్షించమని ప్రొద్దుటూరు డీఎస్పీ వై.ప్రసాదరావు హెచ్చరించారు.

సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ ప్రసాదరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు క్రైం, ఫిబ్రవరి 28 : పురపాలక సంఘం ఎన్నికలకు సంబంధించి ఎవరైనా, ఏ పార్టీ వారైనా అభ్యర్థులను బెదిరించి బలవంతపు ఉపసంహరణలకు పాల్పడితే, అలాం టి వాటిని ఉపేక్షించమని ప్రొద్దుటూరు డీఎస్పీ వై.ప్రసాదరావు హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం డీఎస్పీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నామినేషన్ల ఉపసంహరణలో అభ్యర్థులు తమ ఇష్టపూర్వకంగా ఉపసంహరణ చేసుకుంటే సరి, అలా కాదని బలవంతపు ఉపసంహరణ గురించి ఎవరైనా ఒత్తిడి తేస్తే, ఆ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇస్తే, వాటిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రచారాల విషయంలో అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధలను తూ.చ. తప్పక పాటించాలని అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.  పురపాలక పరిధిలో 41 వార్డులకు సంబంధించి 54 పోలింగ్‌ కేంద్రాలు, 131 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారన్నారు. ఇందులో 7 అత్యంత సమస్యాత్మక, 25 సమస్యాత్మక, 22 సాధారణ పోలింగ్‌ కేంద్రాలను గుర్తించడం జరిగిందన్నారు. ఓటరు స్వేచ్చగా ఓటు వేసుకునే వాతావరణంను కల్పిస్తామన్నారు. ప్రచారం 8వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగించాలన్నారు. ఇప్పటి వరకు 17 బైండోవర్‌ కేసులు నమోదు చేశామన్నారు. 18 రూట్‌ మొబైల్‌ పార్టీలు, 9 జోన ల్‌ ఆపీసర్స్‌ టీంలు, 3 స్ర్టైకింగ్‌ ఫోర్స్‌ ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తూ ఉంటాయన్నారు. తన ఆధ్వర్యంలో 2 స్పెషల్‌ 3 స్ర్టైకింగ్‌  ఫోర్స్‌ ఎన్నికల సరళిని నిశితంగా పరిశీలిస్తాయన్నారు.  సమావేశంలో టుటౌన్‌ సీఐ నరసింహారెడ్డి ఉన్నారు. 

Updated Date - 2021-03-01T04:47:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising