ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాయలసీమలో పరిశ్రమలు మూసేస్తే ఎలా!

ABN, First Publish Date - 2021-05-06T05:35:21+05:30

రాయలసీమలో ఉన్న పరిశ్రమలే తక్కువ వాటిని కూడా మూసేస్తే ఎలా అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ముఖ్యమంత్రిని ఒక ప్రకటనలో ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి 

వేంపల్లె, మే 5: రాయలసీమలో ఉన్న పరిశ్రమలే తక్కువ వాటిని కూడా మూసేస్తే ఎలా అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ముఖ్యమంత్రిని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. పొల్యూషన కంట్రోల్‌ బోర్డు ఆదేశాల మేరకు విద్యుత సరఫరా నిలిపి ఇటీవల జిల్లాలోని జువారీ సిమెంటు కర్మాగారాన్ని, చిత్తూరు జిల్లాలోని అమరరాజా కర్మాగారాన్ని ప్రభుత్వం మూసివేసిందన్నారు. కాలుష్య సమస్యలుంటే నోటీసు ఇచ్చి, సమయమిచ్చి పరిష్కరించుకోమని చెప్పాలే తప్ప మూసివేయడం మూర్ఖత్వం, తిరోగమన చర్య అవుతుందన్నారు. జువారీ, అమర్‌రాజా కర్మాగారాలపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. ఇవి రెండూ ప్రతిష్టాత్మక కర్మాగారాలని, రాజకీయ కక్షతోనో మరే కారణంతోనో మూసివేయడం దుర్మార్గమన్నారు. మూసివేత ఆదేశాలను ఉపసంహరించుకుని సమయమిచ్చి పర్యావరణ సమస్యలు పరిష్కరించుకోమని చెప్పాలన్నారు. బీసీల రిజర్వేషన్లు మరో 10 పదేళ్లు పొడిగిస్తూ మంత్రివర్గం తీర్మానించడం హర్షణీయమన్నారు. అదే సమయంలో 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికే వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పాస్పేట్‌ ఎరువుల ధరలను బస్తాకు రూ.350 నుంచి రూ.700 వరకు పెంచడం గర్హనీయమన్నారు. సీనియర్‌ రాజకీయ నాయకురాలు కడప కార్పొరేటర్‌ బోలా పద్మావతి మరణం దిగ్ర్భాంతికి గురి చేసిందన్నారు. ఆమె కుటుబ సభ్యులకు సంతాప సానుభూతి తెలియజేస్తున్నట్లు తులసిరెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-05-06T05:35:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising