ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైక్‌పై నుంచి కూప్పకూలి హోం గార్డు తల్లి మృతి

ABN, First Publish Date - 2021-05-13T05:30:00+05:30

ఎర్రగుంట్లలో హోంగార్డుగా పనిచేస్తున్న వర్దన్‌ రెడ్డి తల్లి కాంతమ్మ(60) ఆసు పత్రినుంచి తిరిగి వస్తుండగా బైక్‌ పై నుంచి కూప్పకూలి మృతి చెందింది.

పల్స్‌ను పరిశీలిస్తున్న 108 సిబ్బంది, పక్కనే సీఐ, కమిషనర్‌, ఏఎస్‌ఐ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్రగుంట్ల, మే 13: ఎర్రగుంట్లలో హోంగార్డుగా పనిచేస్తున్న వర్దన్‌ రెడ్డి తల్లి కాంతమ్మ(60) ఆసు పత్రినుంచి తిరిగి వస్తుండగా బైక్‌ పై నుంచి కూప్పకూలి మృతి చెందింది. వివరా ల్లోకెళితే.. హోంగార్డు వర్దన్‌రెడ్డి తల్లికి రెండు రోజుల నుంచి జ్వరం వస్తోంది. దీంతో ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స చేయించాడు. టైఫాయిడ్‌ జ్వరంగా చెప్పారు. గురువారం ఎర్రగుంట్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి ఇంజక్షన్‌ వేయించుకుని నాలుగురోడ్ల కూడలి వద్ద ఓఆర్‌ఎస్‌ తాపించుకుని బైక్‌పై ఇంటికి బయలు దేరాడు. వేంపల్లి రోడ్డులోని నగర పంచాయతీ కార్యాలయం సమీపంలోకి రాగానే బైక్‌లో వెనుక వైపు కూర్చున్న కాంతమ్మ కిందకు వాలిపోయింది. గమనించిన అతను వెంటనే బైక్‌ ఆపి తన తల్లిని మరొ కరి సహా యంతో కిందికి దించి కూర్చోబెట్టాడు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. 108కు ఫోన్‌ చేయగా అంబులెన్స్‌ వచ్చి సిబ్బంది పరీక్షలు చేసి మృతి చెందిందని తెలిపారు. విషయం తెలుసుకున్న సీఐ సదాశివయ్య, ఏఎస్‌ఐ శ్రీనివాసులు, కమిషనర్‌ జగన్నాథ్‌లు సంఘ టన స్థలికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించి హోంగార్డుని ఓదార్చారు.  

 

Updated Date - 2021-05-13T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising