ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాంకేతిక పద్ధతులతో అధిక దిగుబడులు

ABN, First Publish Date - 2021-02-07T04:38:59+05:30

రైతులు ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించి అధిక దిగుబడులు సాధించేలా చూడాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలపై ఉందని ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు.

వ్యవసాయ పరిశోధన స్థానంలో విష్ణువర్ధన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం వీసీ విష్ణువర్ధన్‌రెడ్డి 


సీకే దిన్నె, ఫిబ్రవరి 6: రైతులు ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించి అధిక దిగుబడులు సాధించేలా చూడాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలపై ఉందని ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. చింతకొమ్మదిన్నె మండలంలోని కృషివిజ్ఞాన కేంద్రం, వ్యవసాయ పరిశోధన స్థానం, ఏరువాక కేంద్రాలను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది పనితీరు ద్వారా ఆచార్య ఎన్జీరంగ విశ్వవిద్యాలయం 13వ స్థానానికి ఎగబాకిందని ఇది అందరి కృషి వలనే సాధ్యమైందని సిబ్బందిని అభినందించారు. కడప కృషి విజ్ఞాన కేంద్రం దేశంలోనే మంచి గుర్తింపు పొందిందని, ఇందుకు విస్తరణ విభాగం పనితీరును ఆయన మెచ్చుకున్నారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ ప్రశాంతి, కేవీకే శాస్త్రవేత్త వీరయ్య, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త పద్మోదయ, శాస్త్రవేత్తలు శిల్పకళ, రామలక్ష్మిదేవి, ప్రశాంతి, తేజ, నాగిరెడ్డి, స్వామిచైతన్య, ప్రత్యూష, మాధురి, అరుణ, సునీల్‌కుమార్‌, శ్రీనివాసాచారి, కృష్ణప్రియ తదితరులు పాల్గొన్నారు.

డిగ్రీకి అవకాశం కల్పించాలి : అగ్రికల్చలర్‌, హార్టికల్చరల్‌ డిప్లమో చేసిన విద్యార్థులకు సాధారణ డిగ్రీ చేసేందుకు అవకాశం కల్పించాలని విద్యార్థి సంఘ జేఏసీ నాయకులు వైస్‌ఛాన్సలర్‌ విష్ణువర్ధన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. 

Updated Date - 2021-02-07T04:38:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising