ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వర్గీయ ఎన్టీఆరే ఆదర్శం

ABN, First Publish Date - 2021-06-21T05:14:31+05:30

‘నీవు పది మందికి అన్నం పెట్టగలిగితే ఆ దేవుడు నీకు ఇంకో విధంగా సాయం చేస్తాడు అని దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు మాటలే.. నాకు ఆదర్శమని’ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.

అన్నదానం చేస్తున్న గోవర్ధన్‌రెడ్డి, హరిప్రసాద్‌, పీరయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): ‘నీవు పది మందికి అన్నం పెట్టగలిగితే ఆ దేవుడు నీకు ఇంకో విధంగా సాయం చేస్తాడు అని దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు మాటలే.. నాకు ఆదర్శమని’ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. కర్ఫ్యూ కారణంగా నగరంలో హోటళ్లన్నీ మూతబడడంతో రిమ్స్‌కు వచ్చే రోగులు భోజనం లేక ఇబ్బంది పడటం గమనించి గత 20 రోజులకు పైగా రిమ్స్‌లో గోవర్ధన్‌రెడ్డి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా గోవర్ధన్‌రెడ్డిని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్‌, ఉపాధి హామీ పథకం మాజీ కౌన్సిల్‌ సభ్యుడు పోతుగంటి పీరయ్య తదితర నాయకులు సన్మానించారు. హరిప్రసాద్‌, పీరయ్యలు మాట్లాడుతూ కరోనా సమయంలో రిమ్స్‌లో అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. 2009లోనే గుంటూరులో జరిగిన యువగర్జన కార్యకర్తలకు 70 వాహనాలు సమకూర్చి భోజన ప్యాకెట్లు అందించామన్నారు. ఈ సందర్భంగా ఆయనను ప్రశంసించి సన్మానించారు. 


ఘనంగా కొల్లు జన్మదిన వేడుకలు

టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర 47వ జన్మదిన వేడుకలను ఆదివారం కడపలో మాజీ ఫిషరీస్‌ స్టేట్‌ డైరెక్టర్‌ యాటగిరి రాంప్రసాద్‌ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు హరిప్రసాద్‌, గోవర్ధన్‌రెడ్డిలు పాల్గొని కేక్‌ కట్‌ చేసి, అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపాధిహామీ రాష్ట్ర కౌన్సిల్‌ మాజీ సభ్యుడు పీరయ్య, శాప్‌ (స్పోర్ట్స్‌) స్టేట్‌ మాజీ డైరెక్టరు దుద్యాల జయచంద్ర, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేషు, మార్కెట్‌యార్డు మాజీ వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌యాదవ్‌, మాజీ డైరెక్టర్‌ ఖాసిం, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T05:14:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising