ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి

ABN, First Publish Date - 2021-07-25T04:44:39+05:30

గురుపౌర్ణమి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో శనివారం జరు పుకున్నారు.

ప్రొద్దుటూరులో ప్రత్యేక అలంకరణలో సాయిబాబా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మలమడుగు రూరల్‌, జూలై 24: గురుపౌర్ణమి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో శనివారం జరు పుకున్నారు. మండలంలోని కన్నెతీర్థంలో వెలసిన బాలత్రిపురసుందరీదేవి, సుందరేశ్వరస్వామి ఆలయంలో  గురుపౌర్ణమి పురష్కరించుకుని ఉద యం బాలత్రిపుర సుందరీదేవి అమ్మవారిని ఆల య కమిటీవారు కూరగాయలతో అలంకరించి శాఖాంబరి ఉత్సవం చేశారు. ఈ ఉత్సవం చేయ డం వలన  పంటలు బాగా పండి రైతులు సుఖసంతోషాలతో ఉంటారని నమ్మకం. దీంతో  ఆల యానికి వచ్చిన భక్తులు కూరగాయలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులతో పాటు అర్చకులు హరిశర్మ తదితరులు పాల్గొన్నా రు. అలాగే నగర పంచాయతీ పరిధిలోని నాగులకట్ట  చౌడేశ్వరీదేవి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ముద్దనూరు రోడ్డు సాయిబాబా ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, మాజీ ఛైర్‌పర్సన్‌ తాతిరెడ్డి తులసి ఉదయా న్నే పూజలు చేశారు.  ఆలయ ప్రాంగణంలో భక్తుల కు ఆలయ కమిటీవారు ప్రసాదం అందజేశారు.  గురుపౌర్ణమి పురష్కరించుకుని ఎమ్మెల్సీ దేవగుడి శివనాథరెడ్డి కుటుంబ సభ్యులు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ప్రొద్దుటూరులో..


ప్రొద్దుటూరు టౌన్‌, జూలై 24: పట్టణంలో గురుపౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. శనివారం వైఎంఆర్‌ కాలనీ, దొరసానిపల్లె, వసంతపేటలలోని సిరిడీసాయి ఆలయాలలో శనివారం తెల్లవారుజాము నుంచి సాయిబాబాకు పంచామృతాభిషే కం చేసి స్వామివారిని  పట్టు వస్త్రాలతో సుందరం గా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని పూజ లు చేశారు.  అనంతరం భక్తులకు తీర్థప్రసాదా లు పంపిణీ చేశారు.


మైలవరంలో..

మైలవరం, జూలై 24 : మండల పరిధిలోని బెస్తవేముల, మైలవరం తదితర గ్రామాల్లో గురుపౌర్ణమి సందర్బంగా శనివారం సాయిబాబా ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు 

చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఆలయా ల్లో భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.  వేపరాలలోని సరస్వతి విద్యామందిరంలో గురుపౌర్ణమి సందర్బంగా ఎం ఈఓ వెంకటేశ్వర్లను పలువురు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు పా ల్గొన్నారు.

కొండాపురంలో..

కొండాపురం, జూలై 24: మండలంలో గురుపౌర్ణమి వేడుకలు శనివారం వైభవంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో సాయిబాబా దేవాలయాలన్నీ కిటకిటలాడాయి.



Updated Date - 2021-07-25T04:44:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising