ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ అనాథ బాలలకు ప్రభుత్వం అండ

ABN, First Publish Date - 2021-07-31T05:13:38+05:30

కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు మృతిచెంది అనాథలుగా మిగిలిన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని కలెక్టర్‌ విజయరామ రాజు పేర్కొన్నారు. జిల్లాలో కరోనాతో

బాధిత బాలలకు ఎఫ్‌డీ బాండ్లను అందజేస్తున్న కలెక్టర్‌ విజయరామరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ విజయరామరాజు

కడప(కలెక్టరేట్‌), జూలై 30: కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు మృతిచెంది అనాథలుగా మిగిలిన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని కలెక్టర్‌ విజయరామ రాజు పేర్కొన్నారు. జిల్లాలో కరోనాతో తల్లిదండ్రులు మృతిచెంది అనాథలైన మూడు కుటుంబాలకు చెందిన నలుగురు పిల్లలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అంద జేసిన ఆర్థిక సాయానికి సంబందించి ఫిక్సిడ్‌ డిపాజిట్‌ బాండ్లను కలెక్టర్‌  అందశారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబరులో జరిగిన ఈ కార్యక్రమంలో అట్లూరు మండలం ముతుకూరుకు చెందిన అరవ రామిరెడ్డి, రమాదేవి పిల్లలు మణి(14) వెంకటశ్రీనాథ్‌(16)లకు, ప్రొద్దుటూరు మండలం సోములవారి పల్లెకు చెందిన షేక్‌ సయ్యిద్‌, మహబూబీల కుమార్తె షేక్‌ కమాల్‌బీ(16), బి.మఠం మండలం సోమిరెడ్డిపల్లెకు చెందిన జి.ప్రకాశం, ఫాతిమాల కుమార్తె గొల్లపల్లి భవానీ(17)లకు బాండ్లను అందజేశారు. అనంతరం ‘బాలల - మహిళల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా కలసి నడుద్దాం’ అనే నినాదంతో ఆర్తి ఫర్‌ గర్ల్స్‌, విజయ ఫౌండేషన ట్రస్టు వారు ముద్రించిన పోస్టర్లను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ పద్మజ, ఎల్డీఎం దుర్గా ప్రసాద్‌, ఏపీడీ నిర్మల, జిల్లా బాలల సంరక్షణ అధికారి బీఆర్‌ సుభా్‌షయాదవ్‌, ప్రొటెక్షన అధికారి కమలకుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-31T05:13:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising