గోవిందరెడ్డీ.... చరిత్ర తెలుసుకో
ABN, First Publish Date - 2021-10-30T04:58:44+05:30
గోవిందరెడ్డీ బద్వేలు రాజకీయాల్లో మా కుటుంబ చరిత్ర తెలుసు కుని మసలాలని టీడీపీనేత కె.రితే్‌షకుమార్‌రెడ్డి మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డికి హితవుపలికారు.
టీడీపీ నేత రితే్‌షకుమార్ రెడ్డి
బద్వేలు, అక్టోబరు29: గోవిందరెడ్డీ బద్వేలు రాజకీయాల్లో మా కుటుంబ చరిత్ర తెలుసు కుని మసలాలని టీడీపీనేత కె.రితే్‌షకుమార్‌రెడ్డి మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డికి హితవుపలికారు. శుక్రవారం ఆయన విలే కరులతో మాట్లాడుతూ జిల్లా రాజకీయాల్లో మా తాత దివంగత మంత్రి వీరారెడ్డి మొదలుకుని మా తల్లి మాజీ ఎమ్మెల్యే కె. విజయమ్మ సహా మాతరం వరకు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నామన్నారు. బద్వేలు ప్రజల కొండంత అభిమానంతో పార్టీని నడుపుతున్నామన్నారు.
ఎన్నికల స్టంట్‌గా అవాకులు, చవాకులు పేలడం దిగజారుడుతనమవుతుందన్నారు. పది కోట్లు కా దుకదా పదివేల కోట్ల రూపాయలిచ్చినా అమ్ముడుబోయే వ్యక్తిత్వం కాదన్నారు. మా నిజాయతీని శంకించే విధంగా బద్వేలు నియోజకవర్గంలో ఏ నాటికీ దిగజారుడు రాజకీయాలు చేయమన్నారు. పార్టీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యంగా పనిచేసే వీరారెడ్డి కుటుంబం కీర్తికి కలంకం తెచ్చేవిధంగా ప్రవర్తించొద్దని హెచ్చరించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మా సత్తా ఏమిటో చూపామని త్వరలో అవసరమైన సందర్భంలో కూడా చూపిస్తామన్నారు.
Updated Date - 2021-10-30T04:58:44+05:30 IST