ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కరోనా కట్టడిలో ప్రభుత్వాల వైఫల్యం’

ABN, First Publish Date - 2021-05-10T04:38:47+05:30

కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమని అఖిలపక్షం అభిప్రాయపడినట్లు పీసీసీ వర్కింగ్‌ ప్రెసి డెంట్‌ తులసిరెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేంపల్లె, మే 9: కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమని అఖిలపక్షం అభిప్రాయపడినట్లు పీసీసీ వర్కింగ్‌ ప్రెసి డెంట్‌ తులసిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కరోనా మహమ్మారిపై జూమ్‌ ద్వారా నిర్వహించిన వర్చువల్‌ సమా వేశంలో కాంగ్రెస్‌ పార్టీ తరపున శైలజానాథ్‌, తులసిరెడ్డి, మస్తాన వల్లి, టీడీపీ తరపున అచ్చెన్నాయుడు, రామానాయుడు, పట్టాభి, సీపీఐ తరపున రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, సీపీఎం తరపున మధు, సత్యనారాయణ పాల్గొన్న సమావేశంలో ప్రభుత్వ వైఫల్యంపై చర్చించారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతుంటే మన దేశంలో పెరగడం విడ్డూరమన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 40 నుంచి 50శాతం, మరణాల్లో 25 నుంచి 30 శాతం భారతలోనే ఉన్నాయన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ మే ఇందుకు కారణమని ఐఎమ్‌ఏ లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌, సీసీ ఎంబీ, టైమ్స్‌, న్యూయార్క్‌ టైమ్స్‌, గార్డియన, ది ఆస్ర్టేలియన పత్రికలు, సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించిందన్నారు.

నేను విన్నాను - నేను ఉన్నాను అని చెప్పిన జగన ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదాన్నారు. ప్రజల తరపున పోరాడాల్సిన జగనరెడ్డి మోదీ భజన చేస్తున్నాడన్నారు. ఉచిత టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన, వెంటిలేటర్లు, మందులు, సిబ్బంది కొరత లేకుండా చూడాలని కోరారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 10లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలన్నారు. 

Updated Date - 2021-05-10T04:38:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising