ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగారం దొరుకుతుంది... ఇసుకే దొరకడం లేదు

ABN, First Publish Date - 2021-06-18T06:00:25+05:30

జిల్లాలో బంగారంతో సహా అన్నీ దొరుకుతున్నాయని, ఒక్క ఇసుక మాత్రం దొరకడంలేదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు ఎస్‌.గోవర్ధనరెడ్డి, హరిప్రసాద్‌ ఆరోపించారు. గురువారం టీడీపీ జిల్లా కార్యాలయంలో వారు మాట్లాడుతూ జిల్లాలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని, దీంతో నెల్లూరు జిల్లా సోమశిల, సంగం నుంచి టిప్పర్‌ రూ.30వేలు పెట్టి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోందని అన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు ఎస్‌.గోవర్ధనరెడ్డి, హరిప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ నేతల విమర్శ

కడప, జూన 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బంగారంతో సహా అన్నీ దొరుకుతున్నాయని, ఒక్క ఇసుక మాత్రం దొరకడంలేదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు ఎస్‌.గోవర్ధనరెడ్డి, హరిప్రసాద్‌ ఆరోపించారు. గురువారం టీడీపీ జిల్లా కార్యాలయంలో వారు మాట్లాడుతూ జిల్లాలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని, దీంతో నెల్లూరు జిల్లా సోమశిల, సంగం నుంచి టిప్పర్‌ రూ.30వేలు పెట్టి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోందని అన్నారు. మన జిల్లాలోని ఇసుక కర్నాటక, తెలంగాణ వారికి దొరుకుతోందని, జిల్లావాసులకు మాత్రం అందుబాటులో ఉండడంలేదని విమర్శించారు. దీన్ని బట్టి చూస్తే ఇసుక దోపిడీ ఎంత దర్జాగా జరుగుతుందో తెలుస్తోందన్నారు. జగన సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటికి ఇసుక పాలసీ మూడుసార్లు మార్చారని గుర్తుచేశారు. ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేడమే ప్రభుత్వ పనిగా ఉందని విమర్శించారు. టీడీపీ హయాంలో కళకళలాడిన భవన నిర్మాణ రంగం వైసీపీ సర్కారు వచ్చిన తరువాత కుదేలైందన్నారు. ఇసుక దొరక్కపోవడంతో పనులు లేక కార్మికులు పస్తులున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.1500 ఉండే ఇసుక ట్రాక్టరు ఇప్పుడు రూ.6వేలు, రూ.15వేలు ఉండే టిటిప్పరు రూ.30వేలు ధర పలుకుతున్నాయన్నారు. ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇసుక సరఫరాపై జిల్లా యంత్రాంగం నిఘా ఉంచాలన్నారు. టీడీపీ నాయకులు పోతుగంటి పీరయ్య, జిలానీబాషా, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T06:00:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising