ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గండికోట బ్యాక్‌ వాటర్‌లో గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యం

ABN, First Publish Date - 2021-06-20T05:39:58+05:30

గండికోట బ్యాక్‌వాటర్‌లో గురువారం గల్లంతైన ఇద్దరి మృతదేహాలను ఎట్టకేలకు లభ్యమయ్యాయి. తాళ్లప్రొద్దుటూరుకు చెందిన గోవర్ధనరెడ్డి(29), సుభాషిణి(32)ల మృతదేహాలను తెప్పల సహాయంతో గజఈతగాళ్లు శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో బయటకు తీశారు.

గోవర్ధనరెడ్డి (ఫైల్‌ ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండాపురం, జూన 19: గండికోట బ్యాక్‌వాటర్‌లో గురువారం గల్లంతైన ఇద్దరి మృతదేహాలను ఎట్టకేలకు లభ్యమయ్యాయి. తాళ్లప్రొద్దుటూరుకు చెందిన గోవర్ధనరెడ్డి(29), సుభాషిణి(32)ల మృతదేహాలను తెప్పల సహాయంతో గజఈతగాళ్లు శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో బయటకు తీశారు. 15 తెప్పలు, రెస్క్యూ బోటు గజఈతగాళ్లతో అడిషనల్‌ ఎస్పీ దేవప్రసాద్‌ ఆధ్వర్యంలో తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ విద్యాసాగర్‌ గండికోట బ్యావక్‌వాటర్‌ను జల్లెడపట్టి మృతదేహాలను కనుగొన్నారు. తాళ్లప్రొద్దుటూరు గ్యాస్‌గోడౌనకు కిలోమీటర్‌ దూరంలో మృతదేహాలను గుర్తించినట్లు ఎస్‌ఐ తెలిపారు. తాళ్లప్రొద్దుటూరుకు చెందిన శ్రీనివాసులు, గోవర్ధనరెడ్డి, సుభాషిణి కలిసి తెప్పలో వెళ్తుండగా గురువారం సాయంత్రం బ్యాక్‌వాటర్‌లో అలలు రావడంతో తెప్ప మునిగిందన్నారు. శ్రీనివాసులుకు ఈత రావడంతో బయటపడగా అతని భార్య సుభాషిణి, గోవర్ధనరెడ్డి గల్లంతయ్యారన్నారు. రెండు రోజుల పాటు విస్తృతంగా గాలించి మృతదేహాలను వెలికితీశామని ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 



Updated Date - 2021-06-20T05:39:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising