ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌ఐ చొరవతో కొవిడ్‌ మృతుడికి అంత్యక్రియలు

ABN, First Publish Date - 2021-05-08T05:28:46+05:30

కరోనా వైర్‌సతో మృత్యువాత పడిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులే భయపడుతున్న పరిస్థితుల్లో మీకు అండగా మేమున్నాం అంటూ గాలివీడు ఎస్‌ఐ ఇనాయతుల్లా ముందుకొచ్చి మానవత్వం చాటుకున్నారు.

కరోనాతో మృతిచెందిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఎస్‌ఐ ఇనాయతుల్లా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వైర్‌సతో మృత్యువాత పడిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులే భయపడుతున్న పరిస్థితుల్లో మీకు అండగా మేమున్నాం అంటూ గాలివీడు ఎస్‌ఐ ఇనాయతుల్లా ముందుకొచ్చి మానవత్వం చాటుకున్నారు. గాలివీడు మండల కేంద్రంలోని చెక్కావాండ్లపల్లెలో దర్జీ వృత్తి నిర్వహించే 60 సంవత్సరాల వ్యక్తి శుక్రవారం కరోనాతో మృతిచెందాడు. ఇతని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ విషయం తెలిసి గాలివీడు ఎస్‌ఐ ఇనాయతుల్లా చొరవ తీసుకుని ఎక్సకవేటర్‌తో గుంత తీయించారు. అనంతరం పీపీఈ కిట్లను ఏర్పాటు చేసి మృతుడి కుమారుడు, స్థానిక స్వచ్భంద సంస్థ సేవాభావం సభ్యులు ఆర్యశంకర్‌, నవీన్‌, మహే్‌షల సహకారంతో కొవిడ్‌-19 నిబంధనల మేరకు అంత్యక్రియలను పూర్తి చేయించారు. అదే గ్రామంలో వారం క్రితం ఓ మహిళ కరోనాతో మృతిచెందగా అంత్యక్రియలకు ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు కూడా ఎస్‌ఐ  కుటుంబ సభ్యుల్లో మనోధైౖర్యాన్ని నింపి అంత్యక్రియలు జరిపించారు.

- గాలివీడు 

Updated Date - 2021-05-08T05:28:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising