ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి కడప డిపో ద్వారా 64 బస్సులు

ABN, First Publish Date - 2021-06-20T05:43:02+05:30

కరోనా కర్య్ఫూను రాష్ట్ర ప్రభుత్వం సడలించిన నేపథ్యంలో సోమవారం కడప డిపో ద్వారా సుమారు 64 బస్సులు నడుస్తాయని డిపో మేనేజర్‌ నిరంజన్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిపో మేనేజర్‌ నిరంజన్‌

కడప (మారుతీనగర్‌), జూన 19 : కరోనా కర్య్ఫూను రాష్ట్ర ప్రభుత్వం సడలించిన నేపథ్యంలో సోమవారం కడప డిపో ద్వారా సుమారు 64 బస్సులు నడుస్తాయని డిపో మేనేజర్‌ నిరంజన్‌ తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ తిరుపతి, కర్నూల్‌, అనంతపురం, మదనపల్లి, నెల్లూరు, విజయవాడ, పులివెందుల, ప్రొద్దుటూరు, బద్వేల్‌, రాజంపేట, తదితర ప్రాంతాలకు బస్సులు వెళ్లనున్నాయన్నారు. ఇప్పటివరకూ కడప డిపో నుంచి కేవలం 42 బస్సులను 13వేల కిలోమీటర్ల మేరకు తిప్పగలిగామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సోమవారం నుంచి 64 బస్సుల ద్వారా సుమారు 23 వేల కిలోమీటర్లు తిరిగేలా ప్రణాళిక రూపొందించామన్నారు. బస్సులన్నీ కూడా వాటి సమయానికంటే అరగంట ముందునుంచే బస్టాండులో ఉంటాయి. కొవిడ్‌ నిబంఽధనలు అనుసరించి ప్రజలు బస్సుల్లో ప్రయాణించాలని కోరారు.


బస్సుల రూట్లు.. వేళలు

- కడప నుంచి తిరుపతికి 12 బస్సులు నడుస్తాయి. తెల్లవారుజామున 4-30, 5-00, 5-30, 6-00, 6-30, 7-00, 7-30, 8-15, 9-00, 9-45, 10-30, 11-15 గంటలకు బస్సులు ఉంటాయి. 

- కడప నుంచి కర్నూల్‌ వైపు 10 బస్సులు ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున 4-30, 5-00, 5-30, 6-00, 6-30, 7-00, 7-20, 7-40, 8-00, 8-20 గంటలకు బస్సులుంటాయి.

- కడప నుంచి అనంతపురం వైపు 10 బస్సులు కేటాయించారు. తెల్లవారుజామున 4-30, 5-00, 5-30, 6-00, 6-30, 7-00, 7-30, 8-00, 9-00, 9-30 గంటలకు బస్సులుంటాయి. 

- కడప నుంచి మదనపల్లికి 6 బస్సులు వేశారు. తెల్లవారుజామున 4-30, 5-15, 6-00, 6-45, 7-30, 11-00 గంటలకు బయలుదేరుతాయి. 

- కడప నుంచి నెల్లూరుకు 4 బస్సులు. తెల్లవారుజామున 4-00, 5-30, 6-00, 6-30, గంటలకు.

- కడప నుంచి విజయవాడకు 7బస్సులు. తెల్లవారుజామున మార్కాపురం మీదుగా 4-30, 5-00, 5-30, కావలిమీదుగా. 6-00, మార్కాపురం మీదుగా 7-00, 8-00, కావలి మీదుగా ఉదయం 9-00 గంటలకు ఉంటాయి.

- కడప నుంచి పులివెందులకు 5-30, 6-00, 7-00, 9-30 గంటలకు, ప్రొద్దుటూరుకు 5-30, 6-00, 6-30, 7-00 గంటలకు, కోగటం మీదుగా ప్రొద్దుటూరుకు ఉదయం 6-00 గంటలకు బస్సులు బయలుదేరుతాయి. కడప నుంచి బద్వేల్‌ 6 సింగల్స్‌, కడప నుంచి రాజంపేట 6 సింగల్స్‌ తెల్లవారుజామున...5-30, 6-00, 6-30 గంటల నుంచి తిరగనున్నాయి.

Updated Date - 2021-06-20T05:43:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising