ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ నలుగురు..

ABN, First Publish Date - 2021-05-13T05:11:47+05:30

కరోనా మహమ్మారి అందరినీ అతలాకుతలం చేస్తోంది. కరోనాతో చనిపోతే కాటికి మోసుకు పోవడానికి కూడా నలుగురు మనుషులు రాని పరిస్థితి. పేదలైతే మృతదేహాలను ఆసుపత్రి వద్దే వదిలేస్తున్నారు. ఇలాంటి తరుణంలో రైల్వేకోడూరు ముస్లిం జేఏసీ సభ్యులు డాక్టర్‌ సయ్యద్‌ అహ్మద్‌, అర్షద్‌, మహమ్మద్‌, ఇమ్రాన మేమున్నామంటూ

జేఏసీ సభ్యులు డాక్టర్‌ సయ్యద్‌ అహ్మద్‌, అర్షద్‌, మహమ్మద్‌, ఇమ్రాన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనాతో చనిపోయిన వారికి ఉచిత అంత్యక్రియలు

మానవత్వం చాటుకుంటున్న ముస్లిం యువకులు

రైల్వేకోడూరు రూరల్‌, మే 12: కరోనా మహమ్మారి అందరినీ అతలాకుతలం చేస్తోంది. కరోనాతో చనిపోతే కాటికి మోసుకు పోవడానికి కూడా నలుగురు మనుషులు రాని పరిస్థితి. పేదలైతే మృతదేహాలను ఆసుపత్రి వద్దే వదిలేస్తున్నారు. ఇలాంటి తరుణంలో రైల్వేకోడూరు ముస్లిం జేఏసీ సభ్యులు డాక్టర్‌ సయ్యద్‌ అహ్మద్‌, అర్షద్‌, మహమ్మద్‌, ఇమ్రాన మేమున్నామంటూ ముందుకు వచ్చారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఎక్కడ ఎవరు సమాచారం ఇచ్చినా వీరు నలుగురూ అక్కడికి వెళ్లి వారి మత సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, చిట్వేల్‌లో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారిలో 20 మృతదేహలకు వీరు అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వానికి మతంతో సంబంధం లేదని నిరూపిస్తున్న ఈ ముస్లిం యువకులను పలువురు అభినందిస్తున్నారు. ఈ నలుగురిలో ఒకరు డాక్టర్‌ మరొకరు ఓ దుకాణంలో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరూ చికెన పకోడా అమ్మకంతో జీవనం సాగిస్తున్నారు. వీరు సామాన్యులే అయినా అవసరం సమయంలో అసామాన్య సేవలు అందిస్తు ప్రశంసలు అందుకుంటున్నారు.


దాతలు అంబులెన్స సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది

కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాల మానసిక క్షోభను చూడలేక ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు డాక్టర్‌ సయ్యద్‌ అహ్మద్‌ తెలిపారు. తనకు తోడుగా అర్షద్‌, మహమ్మద్‌, ఇమ్రాన కలిశారని అన్నారు. తాము నలుగురూ కలిసి రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 20 కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించామని తెలిపారు. కొంతమంది భయంతో మృతదేహలను చూడ్డానికి కూడా రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరి కొంతమంది ఆర్థిక పరిస్థితి బాగాలేక మృతదేహాలను హస్పిటల్‌ వద్ద వదిలేసి వస్తున్నారని అలాంటి వారు తమకు సమాచారం ఇస్తే వెళ్లి సొంత ఖర్చుతో అంబులెన్సలో మృతదేహలను తరలించి వారి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, దాతలు ఒక్క అంబులెన్స సౌకర్యం కల్పిస్తే తమ సేవను మరింతగా విస్తరిస్తామని అన్నారు.

Updated Date - 2021-05-13T05:11:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising