ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించండి

ABN, First Publish Date - 2021-12-31T05:03:12+05:30

వాహన చోదకులు నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని సీఐ భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు.

పులివెందులలో ర్యాలీ నిర్వహిస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పులివెందుల టౌన్‌, డిసెంబరు 30: వాహన చోదకులు నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని  సీఐ భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎస్పీ అన్బురాజన్‌ ఆదేశాల మేరకు సీఐ భాస్కర్‌రెడ్డి, ట్రాఫిక్‌ ఎస్‌ఐ హాజీవలి ఆధ్వర్యంలో పోలీసులు ప్రమాదాల నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పూలంగళ్ల సర్కిల్‌, ఆర్టీసీ సర్కిల్‌లో ప్రజలకు నిబంధనలను వివరిస్తూ అవగాహన కల్పించారు. బైక్‌ రైడర్లు హెల్మెట్‌ ధరించకపోవడం వలన కారు డ్రైవర్లు సీటు బెల్టు పెట్టుకోకపోవం వల్ల ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తుచేశారు. దేశంలో ప్రతిరోజు 28మంది చొప్పున రోడ్డు ప్రమాదంలో హెల్మెట్‌ లేకపోవడం వలన ప్రాణాన్ని కోల్పోతున్నారన్నారు. అలాగే ఇంటి నుంచి బయటకు వచ్చేటపుడు మాస్కు తప్పకుండా ధరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణభద్రత దృష్ట్యా ఈ కార్యక్రమం చేపట్టామని, నిబంధనలు పాటించాలని వారు కోరారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, మహిళా సంరక్షణ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T05:03:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising