ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాలేరు-నగిరి కాల్వలో చేపలు మృతి

ABN, First Publish Date - 2021-05-06T04:58:28+05:30

మండల పరిధి ఉప్పలూరు సమీపంలో గాలేరు-నగిరి కాల్వ నుంచి చనిపోయిన చేపలు వస్తున్నాయని, దీంతో నీరు దుర్వాసన వస్తోంద ని గ్రామస్థులు తెలిపారు.

కాల్వలో చనిపోయిన చేప పిల్లలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముద్దనూరు మే 5: మండల పరిధి ఉప్పలూరు సమీపంలో గాలేరు-నగిరి కాల్వ నుంచి చనిపోయిన చేపలు వస్తున్నాయని, దీంతో నీరు దుర్వాసన వస్తోంద ని గ్రామస్థులు తెలిపారు. గాలే రు-నగిరి కాల్వకు కొద్ది నెలలుగా నీరు వదలక పోవడంతో ఎక్కడి నీరు అక్కడే నిల్వ ఉన్నాయి. రెండు రోజుల క్రితం కాల్వకు నీరు వదలడంతో వామికొండ జలాశయంలోకి నీరు ప్రవహిస్తోంది. ఈ నీరు ఉప్పలూరు నుంచి మాదన్నగారిపల్లెకు వెళ్లే రోడ్డు మార్గంలోని వంక బిడ్జి కింద నుంచి ప్రవహిస్తంది. దీంతో నీటిలో ప్రవాహంలో చనిపోయిన చేపలు వస్తున్నాయి. అంతేకాకుండా సర్వరాయసాగర్‌కు వెళ్లే గేటు వద్ద భారీగా చనిపోయిన చేప పిల్లలు ఉన్నాయి. అయితే చేపలు ఎందుకు చనిపోయాయన్నది ప్రజలకు అర్థం కావడం లేదు. గండికోట ప్రాజెక్టులో చేపలు పట్టే మత్యకారులను విచారించగా డ్యాంలో ఎటువంటి సమస్య లేదని, కాల్వలో నీరు చాలా కాలంగా నిల్వ ఉండటంతో ఎండకు నీరు వేడెక్కడంతో చేపలు చనిపోయి ఉంటాయని తెలిపారు. 


వ్యర్థాలు పోయేందుకే నీటిని వదిలాం

గాలేరు-నగిరి కాల్వలోని వ్యర్థాలతో నీరు కంపు కొడుతోందని, అది తొలగిపోయేందుకే నీటిని వదిలామని జీఎన్‌ఎ్‌సఎస్‌ ఈఈ రామాంజనేయులు తెలిపారు. రెండు రోజుల నుంచి 500 క్యూసెక్కుల నీటిని శెట్టివారిపల్లె హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి గాలేరు-నగిరి కాల్వకు విడుదల చేశామని, బుధవారం నుంచి తగ్గించి 200 క్యూసెక్కులు మాత్రమే వదులుతున్నామని తెలిపారు.

Updated Date - 2021-05-06T04:58:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising