ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడుల్లో భయంభయం..!

ABN, First Publish Date - 2021-04-16T05:19:01+05:30

జిల్లాలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. పాజిటివ్‌ కేసులు తగ్గినట్లే తగ్గి అడ్డుఅదుపు లేకుండా మళ్లీ పెరుగుతున్నాయి. ప్రధానంగా విద్యాసంస్థల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.

కడప నగరపాలక ఉన్నత పాఠశాలలోని తరగతిలో భౌతిక దూరం పాటించకుండా కూర్చున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యాసంస్థల్లో మాటేసిన మహమ్మారి

నిబంధనలు పాటించని ప్రభుత్వ పాఠశాలలు

పట్టించుకోని అధికారులు

కడప (ఎడ్యుకేషన్ల), ఏప్రిల్‌ 15 : జిల్లాలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. పాజిటివ్‌ కేసులు తగ్గినట్లే తగ్గి అడ్డుఅదుపు లేకుండా మళ్లీ పెరుగుతున్నాయి. ప్రధానంగా విద్యాసంస్థల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇటీవల నమోదైన కేసుల్లో అత్యధికంగా విద్యాసంస్థల్లోనే వస్తున్నాయి. ఉదాహరణకు కడప నగరంలో ఒక ప్రైవేటు విద్యాసంస్థలో 36 మందికి పాజిటివ్‌ వచ్చింది. అలాగే వేంపల్లె త్రిబుల్‌ ఐటీలో కేజీబీవీతో పాటు పలు విద్యాసంస్థల్లో కూడా కేసులు నమోదవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం నిబంధనలు పాటించకపోవడమే. ప్రైవేటు విద్యాసంస్థల్లో కొంత నిబంధనలు పాటిస్తున్నప్పటికీ  కేసులు నమోదవుతున్నాయి. నిబంధనలు పాటించని ప్రభుత్వ పాఠశాల ల్లో పరిస్థితి దారుణంగా ఉందని చెప్పవచ్చు. ఇక్కడ స్వాబ్‌ పరీక్షలు ఎక్కువగా నిర్వహిస్తే మరిన్ని కేసులు వెలుగుచూసే అవకాశం ఉంది. గురువారం ‘ఆంరఽధజ్యోతి’ బృందం పలు పాఠశాలలను విజిట్‌ చేయగా చాలాచోట్ల నిబంధనలు పాటించని విషయం వెలుగుచూసింది.


నిబంధనలు ఇలా

కరోనా నిబంధనల ప్రకారం ప్రతి విద్యార్థి మాస్కు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. శానిటైజరు ఉపయోగించాలి. ప్రతి పాఠశాల ప్రధాన ద్వారం వద్దనే ధర్మల్‌ స్ర్కీనింగ్‌, శానిటైజరు ఏర్పాటు చేయాలి. తరగతి గదిలో కొవిడ్‌ నిబంధనల ప్రకారం 16 మంది మాత్రమే ఉండాలి. పాఠశాలలో 40 మందికన్నా విద్యార్థులు ఎక్కువ ఉంటే తరగతులు విభజించాలి. అవసరమైతే రోజుమార్చి రోజు తరగతులు నిర్వహించాలి. అయితే ఈ నిబంధనలు ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడా కనిపించడంలేదని చెప్పాలి.


ప్రకటనలకే పరిమితం

పాఠశాలల్లో, కళాశాలల్లో కోవిడ్‌ కేసులు విస్తరిస్తుండడంతో వైద్యఆరోగ్యశాఖ హైఅలర్ట్‌ ప్రకటించింది. మాస్కులు ఉంటే విద్యాసంస్థల్లోకి అనుమతించాలని, అలాగే భౌతిక దూరం  పాటిస్తూ శానిటైజర్లు ఉపయోగించాలని విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిబంధనలు జిల్లావ్యాప్తంగా ఎక్కడా అమలు కాలేదని చెప్పాలి. విద్యాసంస్థలను పర్యవేక్షించాల్సిన అధికారులు వారికి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో పాఠశాలల్లో కొవిడ్‌ నిబంఽధనలను ఎవ్వరూ పాటించడం లేదు. అదేస్థాయిలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని చెప్పవచ్చు.


కొన్ని ఉదాహరణలు..

- కడప నగరం మున్సిపల్‌ హైస్కూలులో 1414 మంది విద్యార్థులున్నారు. నిబంధనల ప్రకారం 35 మంది తరగతిగదిలో ఉండాలి. అంటే ఆ పాఠశాలలో 40 తరగతి గదులు ఉండాలన్న మాట. అయితే తరగతి గదులు 25 మాత్రమే ఉన్నాయి. దీంతో ఒక్కో తరగతి గదిలో 60 నుంచి 70 మంది వరకు ఉన్నారు. కొవిడ్‌ నిబంధనలు ఎక్కడా పాటించలేదనే చెప్పాలి.

- చిట్వేలి మండలం జడ్పీ ఉన్నత పాఠశాలలో 1586 మంది విద్యార్థులు చదువుతున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లేదు.

- పోరుమామిళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 200 మంది ఉన్నారు. మాస్కులు, భౌతిక దూరం, శానిటైజర్‌ వాడ్డం లేదు.

- వేంపల్లె జడ్పీ హైస్కూలులో 420 మంది విద్యార్థులున్నారు. భౌతిక దూరం పాటించడం లేదు. మాస్కులు, శానిటైజర్లు వాడ్డం లేదు. 

- ప్రొద్దుటూరు శ్రీచైతన్య పాఠశాలలో 8 మంది విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చింది. ఉప విద్యాధికారి పాఠశాలను తనిఖీ చేసి పాఠశాలను వారం రోజుల పాటు మూసివేయాలని ఆదేశించినా యాజమాన్యం ఆ ఆదేశాలు బేఖాతరు చేస్తూ పాఠశాలను యధావిధిగా కొనసాగించడం విశేషం.

- జమ్మలమడుగులో విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలు అసలు పాటించడంలేదు. మాస్కులు లేవు, భౌతిక దూరం, శానిటైజేషన లేదు. మాస్కులు లేకుండా గుంపులుగా బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణం చేస్తున్నారు.


పాఠశాలల వివరాలు

జిల్లాలో అన్ని యాజమాన్యాలకు సంబంధించి 4,615 పాఠశాలలున్నాయి. వీటిలో ప్రభుత్వ పాఠశాలలు 3279, ప్రైవేటు 1136 ఉన్నాయి. వీటిలో 4,24,067 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. అలాగే 20,410 మంది ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారు. 


కొంచెం నయం..

గురువారం పరిశీలించిన పాఠశాలల్లో కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో కొంతమేరకు కొవిడ్‌ నిబంధనలు పాటించడం కనిపించింది. పోరుమామిళ్లలోని వెంకటేశ్వర ఇంగ్లీషు మీడియం పాఠశాలలో నిబంధనలు పాటిస్తున్నారు. రాజంపేట రాజు హైస్కూలులో 1050 మంది విద్యార్థులు ఉండగా 770 మంది హాజరయ్యారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నారు. భౌతికదూరం, ధర్మల్‌ స్ర్కీనింగ్‌, శానిటైజేషన ఉన్నాయి.


నిబంధనలు పాటించాల్సిందే

- శైలజ, డీఈవో 

పాఠశాలల్లో కొవిడ్‌ నిబంఽధలు తప్పనిసరిగా పాటించాల్సిందే. లేదంటే వారిపై చర్యలు తీసుకుంటాం. ఏ పాఠశాలలో అయినా విద్యార్థులకు కొవిడ్‌ లక్షణాలున్నా, పాజిటివ్‌ నిర్ధారణ అయినా తప్పనిసరిగా డీఈవో కార్యాలయానికి, డీవైఈవోకు, ఎంఈవోకు సమాచారం తెలపాలి. అలా చేస్తే మేమే అక్కడకు వెళ్లి పరిశీలిస్తాం.

Updated Date - 2021-04-16T05:19:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising