ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు

ABN, First Publish Date - 2021-06-23T05:25:33+05:30

మూడవ పట్టణ పోలీ్‌సస్టేషన్‌ పరిధి సుబ్బిరెడ్డి కొట్టాలలో మంగళవారం సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ రెడ్డి సురేష్‌ తన సిబ్బందితో విస్తృత తనిఖీలు నిర్వహించారు.

గ్రామస్తులతో మాట్లాడుతున్న ఎస్‌ఐ రవికుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు క్రైం, జూన్‌ 22 : మూడవ పట్టణ పోలీ్‌సస్టేషన్‌ పరిధి సుబ్బిరెడ్డి కొట్టాలలో మంగళవారం సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ రెడ్డి సురేష్‌ తన సిబ్బందితో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. అనంతరం ఎస్‌ఐ రెడ్డి సురేష్‌ మాట్లాడుతూ నిషేధిత గుట్కా విక్రయాలకు పాల్పడితే కఠిన చర్య లు తీసుకుంటామన్నారు.  నిబంధనలకు విరుద్ధంగా మద్యం బాటిళ్లు నిల్వ చేసుకుని, విక్రయాలకు పాల్పడితే కేసులు పెడతామన్నారు. ఈ ప్రాంతంలో మట్కా, పేకాట జరుగుతుంటే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

ఫ్యాక్షన్‌ గొడవలకు స్వస్తి చెప్పండి


ఫ్యాక్షన్‌ గొడవలకు స్వస్తి చెప్పాలని రూరల్‌ ఎస్‌ఐ రవికుమార్‌ గ్రామస్తులకు సూచించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ, ప్రొద్దుటూరు డీఎస్పీ అదేశాల మేరకు రూరల్‌ ఎస్‌ఐ రవికుమార్‌ తన సిబ్బందితో మంగళవారం మండల పరిధిలోని చెన్నమరాజుపల్లె గ్రామంలో నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువర్గాలకు చెందిన వారి ఇళ్లను, బయలు ప్రాంతాలను, గడ్డివాములను విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గ్రామంలో వాహనాల రికార్డులను తనిఖీ చేశారు. ఇదిలా ఉండగా, గ్రామ కూడలిలో ఎస్‌ఐ రవికుమార్‌ గ్రామస్తులతో సమావేశమై మాట్లాడుతూ ఫ్యాక్షన్‌ను పక్కన పెట్టి గ్రామాభివృద్ధ్దికి ఇరువర్గాలు సహకరించాలన్నారు. ఏవైనా సమస్యలు వస్తే తమ దృష్టికి తేస్తే సామరస్యపూర్వకంగా పరిష్కరించగలమన్నారు. మట్కా, పేకాటల జోలికి వెళ్లవద్దన్నారు.  కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-23T05:25:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising