ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రాజకీయ కక్షతో ఆర్‌ఆర్‌జీఆర్‌ డిగ్రీ కళాశాలకు పరీక్ష కేంద్రం రద్దు’

ABN, First Publish Date - 2021-07-31T04:57:38+05:30

రాజకీయ కక్షతోనే మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రాన్ని రద్దు చేశారని మాజీ ఎమ్మెల్యే ఆర్‌. రమే్‌షకుమార్‌రెడ్డి యూనివర్సిటీ అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రమే్‌షకుమార్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాలివీడు, జూలై30: రాజకీయ కక్షతోనే మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రాన్ని రద్దు చేశారని మాజీ ఎమ్మెల్యే ఆర్‌. రమే్‌షకుమార్‌రెడ్డి యూనివర్సిటీ అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన నీటి సంఘం మాజీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి స్వగృహంలో మాట్లాడుతూ పూర్తి స్థాయి మౌలిక వసతులు ఉన్న ఆర్‌ఆర్‌జీఆర్‌ డిగ్రీ కాలేజీ పరీక్ష కేంద్రం రద్దుకు రాజకీయ ఒత్తిడే కారణమన్నారు. ఎలాంటి వసతులు లేని శ్రీనివాస డిగ్రీ కాలేజీకి యూనివర్సిటీ అధికారులు వత్తాసు పలకడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్నారు. ఆర్‌ఆర్‌జీఆర్‌ కాలేజీలో దాదాపు 300 మంది విద్యార్థులున్నా, కేవలం 20 మందితో కాలం వెళ్లబుచ్చుతూ అధ్యాపకులు,సిబ్బంది లేకపోయినా అలాంటి కాలేజీకి యూనివర్సిటీ అధికారులు వత్తాసు పలకడం దారుణమన్నారు.యూనివర్శిటీ అధికారులు ఆర్‌ఆర్‌జీఆర్‌ డిగ్రీ కళాశాలను స్వాధీనం చేసుకొని అధికారుల ఆధ్వర్యంలోనే పరీక్షలు నిర్వహించినా అభ్యంతరం లేదన్నారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులు కాలేజీకి రావాలంటే 20 కిలోమీటర్లు, కాలేజీ నుంచి పరీక్ష కేంద్రం రాయచోటికి వెళ్లాలంటే మరో 30 కిలోమీటర్లు ప్రతిరోజు 50 కిలోమీటర్లు ప్రయాణం చేసి వారు పరీక్షలు రాయగలరా అని యూనివర్సిటీ అధికారులను ప్రశ్నించారు. పేద విద్యార్థులపై కక్ష సాధింపు మాని 2011 నుంచి పరీక్ష కేంద్రం ఉన్న ఆర్‌ఆర్‌జీఆర్‌ డిగ్రీ కళాశాలలో కేంద్రం ఏర్పాటుకు అధికారులు చొరవ చూపాలన్నారు.  

Updated Date - 2021-07-31T04:57:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising