ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెన్నానదిలో వంతెన ఏర్పాటు చేయండి

ABN, First Publish Date - 2021-03-22T04:52:11+05:30

జమ్మలమడుగు-వేపరాల మార్గంలో పెన్నానది వద్ద వంతెన నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

జమ్మలమడుగు-వేపరాల పెన్నానదిలో దెబ్బతిన్న రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మలమడుగు రూరల్‌, మార్చి 21: జమ్మలమడుగు-వేపరాల మార్గంలో  పెన్నానది వద్ద వంతెన నిర్మించాలని ఆయా గ్రామాల  ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో అప్పటి ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు-వేపరాల, మైలవరం గ్రామాలకు వెళ్లేందుకు పెన్నానది గుండా సిమెంటు రోడ్డు వేయిం చి ప్రజలకు సౌకర్యం కల్పించారని దీంతో జమ్మలమడుగు నుంచి మైలవరం వెళ్లడానికి అరగంట సమయంతోపాటు తక్కువ ఖర్చుతో గమ్యం చేరుకునేవారమన్నారు. అకస్మాత్తుగా ఏదైనా ఆస్పత్రులకు వెళ్లాలన్నా మైలవరం, వేపరాల వాసులు పెన్నానది గుండా నేరుగా  జమ్మలమడుగు వెళ్లడానికి ఎంతగానో ఈ రోడ్డు మార్గం ఉపయోగపడేదన్నారు. అయితే గతేడాది భారీ వర్షాలతో పెన్నానదికి మైలవరం జలాశయం నుంచి రెండు నెలలపాటు పెన్నానదికి విడుదల చేయడంతో  సిమెంటు రోడ్డు పూర్తి కోతకు గురైందన్నారు. ప్రస్తుతం జమ్మలమడుగు నుంచి వేపరాల మీదుగా మైలవరం చేరుకునే ప్రభుత్వ అధికారులు తదితరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాన్నారు.  ఇప్పటికైనా ప్రభుత్వం సంబందిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ మార్గంలో లో లెవల్‌ వంతెనను ఏర్పాటు చేస్తే భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావని  ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-03-22T04:52:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising