ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాటేసిన కరెంటు

ABN, First Publish Date - 2021-06-24T06:03:48+05:30

పేదల బతుకును కరెంటు బలి తీసుకుంది. రెండు కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. బతుకుదెరువు కోసం కొన్న పైపులే వారి పాలిట యమపాశాలయ్యాయి. చెన్నూరు ఎస్‌ఐ బి.శ్రీనివాసులరెడ్డి తెలిపిన వివరాల మేరకు..

కరెంటు షాక్‌తోమృతి చెందిన చిన్నరెడ్డయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పైపులు తరలిస్తుండగా విద్యుతషాక్‌
ఆటో డ్రైవరుతో పాటు మరొకరి మృతి
చెన్నూరు, జూన 23:
పేదల బతుకును కరెంటు బలి తీసుకుంది. రెండు కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. బతుకుదెరువు కోసం కొన్న పైపులే వారి పాలిట యమపాశాలయ్యాయి. చెన్నూరు ఎస్‌ఐ బి.శ్రీనివాసులరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. చెన్నూరు కొత్తరోడ్డులో ఓ పెయింట్‌షాపు యజమాని షాపును ఖాలీ చేయడంతో ఆ షాపునకు సంబంధించిన రేకులు, పైపులను అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి కొనుగోలు చేశాడు. కొన్న వ్యక్తి తన అన్న చదిపిరాళ్ల చిన్నరెడ్డయ్యను రేకులు తీసుకురావాలని పంపించాడు. ఆయన షేక్‌ షంషీర్‌ (40) అనే ఆటో డ్రైవరును తీసుకుని షాపు వద్దకు వచ్చాడు.  రేకులు, పైపులు మొత్తం ఆటోపైన పెట్టుకున్న తరువాత చివరగా ఉన్న ఒకే ఒక పైపును పైన పెట్టే ప్రయత్నంలో పైనున్న విద్యుత లైన్లకు తగిలింది. దీంతో ఆటో డ్రైవరు షాక్‌కు గురై కింద పడిపోగా ఆటోలో డ్రైవరు స్థానంలో కూర్చుని ఉన్న చిన్న రెడ్డయ్య (73) కూడా షాక్‌ గురై పడిపోయాడు. స్థానికులు హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గవధ్యంలోనే ఇరువురు చనిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా మృతుడు ఆటో డ్రైవర్‌కు భార్య, కుమార్తె, ముగ్గురు కుమారులున్నారు. వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.



Updated Date - 2021-06-24T06:03:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising