ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాల ద్వారా ఈ-శ్రామిక్‌ నమోదు చేయాలి

ABN, First Publish Date - 2021-10-22T04:57:15+05:30

సచివాలయాల ద్వారా కార్మికులు ఈ-శ్రామిక్‌ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకునేలా అవకాశం కల్పించాలని టీఎన్‌టీయూసీ నాయకులు కడప అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ శ్రీనివాసులుకు విజ్ఞప్తి చేశారు.

అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందిస్తున్న టీఎన్‌టీయుసి నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు క్రైం, అక్టోబరు 21 : సచివాలయాల ద్వారా కార్మికులు ఈ-శ్రామిక్‌ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకునేలా అవకాశం కల్పించాలని టీఎన్‌టీయూసీ నాయకులు కడప అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ శ్రీనివాసులుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ప్రొద్దుటూరు వచ్చిన ఆయనను టీఎన్‌టీయుసీ నాయకులు స్వయంగా కలిసి వినతిపత్రం అందించారు. యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం ఈ-శ్రామిక్‌ ద్వారా ఆసంఘటిత కార్మికుల పేర్ల నమోదు జరుగుతోందన్నారు. అయితే తరచూ సర్వర్‌ సరిగా పనిచేయక పోవడం వల్ల ఈ-శ్రామిక్‌లో పేర్లు నమోదు కావడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ-శ్రామిక్‌ పేర్ల నమోదు సచివాలయాలకు అప్పగించడం వల్ల కార్మికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ దిశగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో టీఎన్‌టీయుసీ జిల్లా అధ్యక్షుడు కుతుబుద్దీన్‌, బాలమునిరెడ్డి, దాదాపీర్‌, ఏపీజే అబ్దుల్‌ కలాం కార్మిక సంఘం నాయకులు పద్మ వీరన్న, రామాంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T04:57:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising