ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివ్యాంగుల సంక్షేమానికి కృషి

ABN, First Publish Date - 2021-12-07T05:24:11+05:30

Efforts for the welfare of the disabled

మెగా చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు/ క్రైం/టౌన్‌, డిసెంబరు 6 : దివ్యాంగులు, ట్రాన్స్‌ జెండర్ల సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. సోమవారం కేసీపీ ఫౌండేషన్‌ కార్యాలయంలో 62వ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ కార్యక్ర మంలో ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంప్‌లు ఏర్పాటు చేస్తామని, అవసరమైన వారికి కృత్రిమ అవయవాలు అమర్చడానికి కృషి చేస్తామని తెలిపారు. దివ్యాంగులకు సొంత ఇళ్లు ఉండాలని పేర్కొన్నారు. దివ్యాంగులు, ట్రాన్స్‌ జెండర్లకు రేషన్‌ కార్డులు మంజూరు చే యాలని అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తెస్తామ న్నారు. దివ్యాంగుల కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్‌పర్సన్‌ ముంతాజ్‌ పఠాన్‌, కొత్తపల్లె సర్పంచ్‌ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ మదర్‌ థెరిసా దివ్యాంగుల సేవా సమితి అధ్య క్షుడు షాకీర్‌ హుసేన్‌, జన సేవా సమితి అధ్యక్షురాలు వీణ, సూర్య, మహే శ్వరి, అస్లాంబాషా, అల్తాఫ్‌, చెన్నకేశవరెడ్డి పాల్గొన్నారు.  జిల్లా ఆస్పత్రి ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన జనరిక్‌ మెడికల్‌ షాపును ఎమ్మెల్యే ప్రారంభించారు.  ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ డేవిడ్‌ సెల్వరాజ్‌, ఆర్‌ఎంవో డాక్టర్‌ ఆనంద్‌బాబు, ఫార్మాసిస్టు తిమోతి పాల్గొన్నారు.  స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో రెండవ విడత ఆసరా మెగా చెక్కును మహిళా సంఘాలకు అందజేశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని 4221 సంఘాల్లోని 43115 మంది సభ్యులకు రూ.32కోట్ల 75లక్షల 67వేల 536 చెక్కును అందజేశారు.  కార్యక్రమంలో మున్పిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మిదేవి, వైస్‌ చైర్మన్‌ బంగారురెడ్డి, పద్మశాలీయ కార్పొరేషన్‌ చైర్మన్‌ జింకా విజయలక్ష్మి, మున్పిపల్‌ కమిషనర్‌ వెంకట రమణయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-07T05:24:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising