డాక్టర్ సుధాకర్ మరణం ప్రభుత్వ మానసిక హత్య
ABN, First Publish Date - 2021-05-23T05:19:17+05:30
డాక్టర్ సుధాకర్ మరణం ప్రభుత్వ మానసిక హత్య అని రాష్ట్ర టీడీపీ సాంస్కృతిక విభాగంగా అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్ తెలిపారు.
టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్
రైల్వేకోడూరు, మే 22: డాక్టర్ సుధాకర్ మరణం ప్రభుత్వ మానసిక హత్య అని రాష్ట్ర టీడీపీ సాంస్కృతిక విభాగంగా అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ డాక్టర్ సుధాకర్ మరణం చాలా బాఽధాకరం అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల పట్ల చూపుతున్న పైశాచిక ప్రేమకు నిదర్శనం డాక్టర్ సుధాకర్ మరణం అన్నారు. కరోనా సమయంలో సుధాకర్ సేవలు అందించారన్నారు. ఎన్95 మాస్కులు, గ్లౌజులు సమకూర్చాలని నిలదీసినందుకు అక్రమ కేసులు బనాయించిందన్నారు. చిత్రహింసలకు గురిచేసిందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని పోలీసుల చేత అణిచివేతకు గురి చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన్ను విధుల నుంచి తొలగించారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే సుధాకర్ కుటుంబానికి కోటి రూపాయలు పరిహరం ఇవ్వాలని డిమాండు చేశారు. దళితులు, గిరిజనులకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Updated Date - 2021-05-23T05:19:17+05:30 IST