ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా సమయంలో దాతల దాతృత్వం

ABN, First Publish Date - 2021-05-17T04:49:55+05:30

కరోనాతో ఉపాధి కోల్పోయి కష్టాలు పడుతు న్న పేదలను ఆదుకోవడానికి దాతలు ముందకువస్తున్నారు.

వృద్ధాశ్రమానికి నిత్యావసర వస్తువులు అందజేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు అర్బన్‌, మే 16 : కరోనాతో ఉపాధి కోల్పోయి కష్టాలు పడుతు న్న పేదలను ఆదుకోవడానికి దాతలు ముందకువస్తున్నారు. ఇందులో భా గంగా పట్టణంలోని చిరువ్యాపారులకు మానవతా ధృక్పధంతో సంస్కృతి స్వచ్ఛంద సేవాసంస్థ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి ఆదివారం  నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒంటేరు మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితులు మానవ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నాయని ఇందుకు ప్రతి పౌరుడు తోచిన విధంగా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్‌ మధుసూదన్‌ బాబు, డాక్టర్‌ శ్రీనివాసులరెడ్డి, రామకృష్ణ,ఎడవల్లి రమణయ్య, దస్తగిరి, నరే్‌ష, రత్నం తదితరులు పాల్గొన్నారు

వృద్ధాశ్రమానికి నిత్యావసర వస్తువుల వితరణ


ప్రొద్దుటూరు టౌన్‌, మే 16: రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వృద్ధాశ్రమానికి ఆదివారం ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దాత మధు సహాయంతో నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా ఆదరణ సంస్థ అధ్యక్షుడు బైసాని సత్యనారాయణ మాట్లాడుతూ కరోనా  సమయంలో విదేశాల్లో ఉన్న యువకులు కన్నభూమిపై ఉన్న మమకారంతో నిత్యావసర వస్తువులను అందజేశారని తెలిపారు.  కార్యక్రమంలో ఆదరణ సంస్థ కార్యదర్శి శ్రీనివాసులు,  ఓబుళరెడ్డి, ఆశ్రమ నిర్వాహకులు సుబ్బరాయుడు, రఘు, తదితరులు పాల్గొన్నారు.

ముద్దనూరులో మాస్కులు పంపిణీ

ముద్దనూరు మే16:ముద్దనూరు గ్రామంలోని ప్రజలకు ఆదివారం మైండ్‌  సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు. పాత బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, పాతవీధి, గంగమ్మగుడి సమీపంలో మాస్కులు అందజేశారు. కార్యక్రమంలో మైండ్‌ సభ్యులు అనిల్‌, విష్ణు, సాయి  పాల్గొన్నారు.



Updated Date - 2021-05-17T04:49:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising