సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌పై ఆందోళన వద్దు
ABN, First Publish Date - 2021-09-13T05:29:11+05:30
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌పై ఎటువంటి ఆందోళన వద్దని, అక్టోబరు 2 నాటికి అందరూ రెగ్యులర్ అవుతారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ (ఏపీజీఈఎఫ్) చైర్మన్ వెంటరామిరెడ్డి ధైర్యం చెప్పారు.
ఏపీజీఈఎఫ్ చైర్మన్ వెంకటరామిరెడ్డి
ప్రొద్దుటూరు అర్బన్ సెప్టెంబరు 12: గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌పై ఎటువంటి ఆందోళన వద్దని, అక్టోబరు 2 నాటికి అందరూ రెగ్యులర్ అవుతారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ (ఏపీజీఈఎఫ్) చైర్మన్ వెంటరామిరెడ్డి ధైర్యం చెప్పారు. ఆదివారం స్థానిక ఇంటర్ నేషనల్ ఫంక్షన్ హాల్లో జిల్లా సచివాలయ ఉద్యోగుల విస్తృతస్థాయి సమావేశాన్ని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ నెలాఖరులో డిపార్ట్‌మెంట్ టెస్ట్ ఉంటుందని, తప్పక అందరూ పాసవుతారని భరోసా ఇచ్చారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోలను తప్పక రెగ్యులర్ చేస్తారన్నారు. ఒకవేల టెస్ట్ పాసవకపోతే 2022 అక్టోబరు రెండు వరకు గడువు ఇస్తారని, ఆలోపు పాసయినా రెగ్యులర్ చేస్తారన్నారు. సర్వీసు సీనియారిటీ స్కేల్ నష్టం జరగదన్నారు. జూనియర్ అసిస్టెంట్ పేస్కేలు డిమాండ్ చేశామని, సర్వీసు రెగ్యులర్ అయ్యాక అన్ని సాధిస్తామన్నారు. కొన్ని ఉద్యోగ సంఘాలు మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని వాటి కుట్రల్లో ఇరుక్కోవద్దన్నారు. రెగ్యు లర్ అయ్యాక 10వేల మందికి పదోన్నతులు కూడా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు అంజి రెడ్డి పట్టణ అధ్యక్షుడు వైవీ ప్రసాద్ , కార్యదర్శి పవన్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకట శివారెడ్డి, వైఎస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
Updated Date - 2021-09-13T05:29:11+05:30 IST