ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్క్‌ లేకుండా బయట తిరగవద్దు : ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2021-04-24T04:26:03+05:30

కరోనా సెకెండ్‌వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో మాస్క్‌ లేకుండా ఎవ్వరూ బయ ట తిరగవద్దని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సూచిం చారు.

జమ్మలమడుగు పాత బస్టాండులో మాస్కులు లేనివారికి మాస్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మలమడుగు రూరల్‌, ఏప్రిల్‌ 23:కరోనా సెకెండ్‌వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో మాస్క్‌ లేకుండా ఎవ్వరూ బయ ట తిరగవద్దని  జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సూచిం చారు. పట్టణంలో శుక్రవారం  ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు ముల్లాజానీ తదితరులతో కలిసి మాస్కులు లేని ద్విచక్ర వాహనదారులకు, ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు, ప్రయాణికులకు నడిచి వెళ్లే బాటసారులకు మాస్కులు అందజేశారు. ప్రస్తుతం కరోనా ఉధృతమవుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు. కొందరికి మాస్కులు ఎమ్మెల్యే  స్వయంగా ధరింపజేశారు.  కార్యక్రమం లో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ వేల్పుల శివమ్మ, బేపారి షామీర్‌ బాష, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా  జమ్మలమ డుగు అర్బన్‌ పోలీసు స్టేషన్‌ ఎస్‌ఐ తిరుపాల్‌నాయక్‌, వారి సిబ్బంది శుక్రవారం  గేటు వద్దనే కూర్చొని ప్రజా సమ స్యలను పరిష్కరించే దిశగా వారి వారి సమస్యలను విన్నారు. 

కరోనా కట్టడికి చర్యలు : డీఎస్పీ


ప్రొద్దుటూరు క్రైం, ఏప్రిల్‌ 23 : పట్టణంలో కరోనా వైరస్‌ కట్టడికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ వై.ప్రసాదరావు తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి చెక్‌ పెట్టాలంటే మాస్క్‌లు ధరించడం, శానిటైజర్‌తో తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ముఖ్యంగా సీఐలు, ఎస్‌ఐలతో మాస్క్‌ధారణపై తనిఖీలు చేపడుతున్నామని, మాస్క్‌లు ధరించక రోడ్డుపైకి వస్తే, జరిమానాలను విధిస్తున్నామన్నారు. కరోనా కట్టడిలో భాగంగానే పట్టణంలోని వ్యాపారులకు రాత్రి 8 గంటలకే దుకాణాలను మూసివేయాలని విజ్ఞప్తి చేశామన్నా రు. ఇప్పటికే బంగారు వ్యాపారులు స్వచ్చందంగా సాయం త్రం 4 గంటలకే బంగారు దుకాణాలను మూసివేస్తున్నారని డీఎస్పీ తెలిపారు. అత్యవసరమైతేనే బయటికి రావాలన్నారు. 

రాజుపాళెంలో..

రాజుపాళెం, ఏప్రిల్‌ 23: కొవిడ్‌ నిబంధనలు అనుసరించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ఎస్‌ఐ కృష్ణంరాజు నాయక్‌ తెలిపారు. శుక్రవారం నుంచి దుకాణాలు, గ్రామాల్లోని వీధుల్లో భౌతిక దూరం పాటించి మాస్కు తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు. రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎక్కడ ఎలాంటి గుంపులు కానీ ఉండకూదని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ కొవిడ్‌ నిబంఽధనలు అతిక్రమిస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 

ముద్దనూరులో..


ముద్దనూరు ఏప్రిల్‌23:కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున ప్రజలు గుంపులుగా ఉండరాదని ఎస్‌ఐ శంకర్‌రావు సూచించారు. శుక్రవారం జనాలు ఉండే ప్రధాన కార్యాలయాలు, కేంద్రాల వద్దకు వెళ్లి మైకు ద్వారా కరోనా పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  మాస్కు లేకుం డా బయటకు వస్తే జరిమానా విధిస్తామన్నారు.  కార్యక్రమంలో ఏఎస్‌ఐ శ్రీనివాసులు , పోలీసులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-04-24T04:26:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising