ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన తరువాత బహిరంగ ప్రదేశాల్లో తిరగరాదు: ఎస్‌ఐ

ABN, First Publish Date - 2021-05-17T05:08:54+05:30

మండలంలోని ప్రజలు కరోనా మహమ్మారి పట్ల జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సిద్దవటం ఎస్‌ఐ రమే్‌షబాబు తెలియజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దవటం, మే16 : మండలంలోని ప్రజలు కరోనా మహమ్మారి పట్ల జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సిద్దవటం ఎస్‌ఐ రమే్‌షబాబు తెలియజేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ  ఒక వేళ ఎవరికైనా కరోనా పాజిటివ్‌ వచ్చినట్లైతే వెంటనే సంబంధిత డాక్టర్‌ను సంప్రదించి జాగ్రత్తలు పాటించి చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లాలన్నారు.  ఒక వేళ ఆసుపత్రికి వెళ్లకపోతే వైద్యులు సూచించిన విధంగా ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నప్పుడు బయటికి వచ్చి బహిరంగ ప్రదేశాల్లో తిరిగి ఇతరుల ఆరోగ్యం చెడగొట్టరాదన్నారు. అలా చేయడం చట్టరీత్యా నేరమన్నారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాలలో తిరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.అంతేకాకుండా వలంటీర్లు పోలీసులకు సహకరించాలన్నారు.

Updated Date - 2021-05-17T05:08:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising