ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్లూరు ఇసుక క్వారీకి రైతుల అభ్యంతరంపై చర్చలు

ABN, First Publish Date - 2021-05-13T04:53:16+05:30

మండల పరిధిలోని కల్లూరు వద్ద ఇసుక క్వారీ ఏర్పాటుకు రేగుళ్ళపల్లె రైతులు వారం రోజులుగా అభ్యంతరం తెలుపుతూ వాహనాలను అడ్డుకోవడం, ఆందోళన చేయడంపై ఎట్టకేలకు అధికారులు స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు అర్బన్‌, మే 12 : మండల పరిధిలోని కల్లూరు వద్ద ఇసుక క్వారీ ఏర్పాటుకు రేగుళ్ళపల్లె రైతులు వారం రోజులుగా అభ్యంతరం తెలుపుతూ వాహనాలను అడ్డుకోవడం, ఆందోళన చేయడంపై ఎట్టకేలకు అధికారులు స్పందించారు. బుధవారం తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌, రూరల్‌ సీఐ మధుసూదన్‌ గౌడ్‌, ఇసుక క్వారీ అధికారులు రేగుళ్ళపల్లె రైతులతో చర్చించారు. ప్రభుత్వం మంజూరు చేసిన క్వారీని అడ్డుకోకూడదన్నారు. భూగర్భ జలాలు పరిరక్షిస్తూనే క్వారీలో తవ్వకాలు జరుగుతాయని అధికారు లు తెలిపారు. కల్లూరు ఇసుక క్వారీకి రేగుళ్ళపల్లె పొలాల మీదుగా వేసిన రహదారి కింద నీటి పైపులు ఉన్నాయని, భారీ వాహనాలు తిరిగితే  దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందు కు రోడ్డు నిర్మాణం చేసే కాంట్రాక్టర్‌ పైప్‌లైన్‌  దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకొని రోడ్డును ఏర్పాటు చేయాలని సూచించారు. పైపులైను దెబ్బతింటే కాంట్రాక్టరే బాధ్యత వహిస్తాడని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో రైతులు సమ్మతించినట్లు తహసీల్దారు తెలిపారు.

Updated Date - 2021-05-13T04:53:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising