ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడు వ్యవసాయం పండుగ... నేడు దండుగ

ABN, First Publish Date - 2021-06-20T05:41:50+05:30

టీడీపీ పాలనలో వ్యవసాయం లాభసాటిగా ఉండడంతో రైతులు ఇళ్లల్లో పండుగ వాతావరణం ఉండేదని, కానీ వైసీపీ పాలనలో వ్యవసాయం గిట్టుబాటు కాక పంట నష్టపరిహారం అందక దండగగా మారిందని టీడీపీ నేతలు విమర్శించారు.

డీఆర్వో మలోలాకు వినతిపత్రం ఇస్తున్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగనరెడ్డికి రైతుల కంట తడి కనబడలేదా?

టీడీపీ నేతల విమర్శ

కడప, జూన 19 (ఆంధ్రజ్యోతి): టీడీపీ పాలనలో వ్యవసాయం లాభసాటిగా ఉండడంతో రైతులు ఇళ్లల్లో పండుగ వాతావరణం ఉండేదని, కానీ వైసీపీ పాలనలో వ్యవసాయం గిట్టుబాటు కాక పంట నష్టపరిహారం అందక దండగగా మారిందని టీడీపీ నేతలు విమర్శించారు. రాష్ట్ర టీడీపీ పిలుపు మేరకు రైతుల సమస్యలపై శనివారం డీఆర్వో మలోలాకు పార్లమెంటు కడప టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడి, కడప నియోజకవర్గ ఇన్చార్జి అమీర్‌బాబు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో జిల్లాలో రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే వరుస విపత్తులతో న ష్టపోయిన అన్నదాతలకు ధాన్యం బకాయిలు సరైన సమయంలో చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లాలో మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేయాలన్నారు. జిల్లాలో ఎక్కువ సంఖ్యలో కౌలు రైతులు ఉన్నారని, వారికి విత్తనాలు, ఎరువులు కూడా అందని పరిస్థితి ఉందన్నారు. జిల్లాలో రైతులకు చెల్లించాల్సిన ఇనఫుట్‌ సబ్సిడీ ఇంత వరకు అందలేదన్నారు. పంటల బీమా, సున్నావడ్డీ చెల్లింపుల్లో అనేక మంది రైతులు కౌలు రైతులకు ప్రభుత్వ సాయం అందలేదన్నారు. జిల్లాలో ఖరీ్‌ఫలో వరికి ఇన్సురెన్స మంజూరైనా వేరుశెనగ, పత్తి, జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర, సజ్జ, పసుపు వంటి పంటలకు బీమా మంజూరు కాలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కడప పార్లమెంటు రైతు విభాగం ప్రధాన కార్యదర్శి తుమ్మలూరు మల్లిఖార్జున, కడప నగర అధ్యక్షుడు శివకొండారెడ్డి, ప్రధాన కార్యదర్శి జలతోటి జయకుమార్‌, మాజీ కడప నగర అధ్యక్షుడు జిలానీబాషా, బీసీ సెల్‌ జిల్లా కార్యదర్శి మాసాకోదండరాం, జనార్ధనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T05:41:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising