ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వై.కోట అడవుల్లో కూంబింగ్‌

ABN, First Publish Date - 2021-06-24T04:57:48+05:30

నియోజకవర్గంలోని వై.కోట అడవులను రాజంపేట డీఎ్‌పవో జి.శ్రీనివాసులు ఆధ్వ ర్యంలో బుధవారం జల్లెడ పట్టారు.

అడవిలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న డీఎ్‌ఫవో, సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఎఫ్‌వో ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు


రైల్వేకోడూరు, జూన్‌ 23: నియోజకవర్గంలోని వై.కోట అడవులను రాజంపేట డీఎ్‌పవో జి.శ్రీనివాసులు ఆధ్వ ర్యంలో బుధవారం జల్లెడ పట్టారు. కేవీ బావి నుంచి వై.కోట వరకు ఉన్న అడవులను క్షుణ్ణంగా పరిశీలించారు. అడవిలో సిబ్బంది తీసుకోవాల్సి జాగ్రత్తల గురించి డీఎ్‌ఫవో వివరించారు. అడవిలో ఎర్రచందనం చెట్లను పరిశీలించి అడవిలోకి స్మగ్లర్లు ఏ దారిన వస్తున్నారని పరిశీలించారు. స్మగ్లర్లకు ఎవరు సహకరిస్తున్నారని తెలుసుకుని వారిని కూడా పట్టుకుని కేసులు నమోదు చేస్తామని డీఎ్‌ఫవో శ్రీనివాసులు హెచ్చరించారు. అటవీ సంపదను రక్షించాల్సిన బాధ్యత ప్రజలపైన ఉందన్నారు. అటవీ శివారు గ్రామాల్లోకి ఎవరైనా కొత్తగా కనిపిస్తే అటవీశాఖకు సమాచారం తెలపాలన్నారు. తమిళ స్మగ్లర్లపై ప్రత్యేక నిఘాలు ఉంటాయని తెలిపారు. ఉన్న సిబ్బందితోనే కూంబింగ్‌ చేయిస్తున్నామని, అంతేకాకుండా బేస్‌ క్యాంపు, ప్రొటెక్షన్‌ వాచర్లతో కూడా కూంబింగ్‌ చేయించి ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. అడవిలోకి రావాలంటే అటవీశాఖాధికారుల అనుమతి ఉండాలన్నారు. లేకుంటే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2021-06-24T04:57:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising