ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖైదీలకు కరోనా రిలీఫ్‌

ABN, First Publish Date - 2021-05-10T05:08:14+05:30

కొవిడ్‌ ఉధృతి నేపధ్యంలో జైళ్లలో రద్దీని తగ్గించేందుకు సర్వోన్నత న్యాయస్థానం శనివారం కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

30 మందికి పైగా పెరోల్‌ లభించే అవకాశం !


కడప(క్రైం), మే 9: కొవిడ్‌ ఉధృతి నేపధ్యంలో జైళ్లలో రద్దీని తగ్గించేందుకు సర్వోన్నత న్యాయస్థానం శనివారం కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మహమ్మారిదృష్ట్యా గత ఏడాది పెరోల్‌ ఇచ్చిన ఖైదీలకు మరోసారి వారిని బెయిలుపైనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో కడప జిల్లా కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు రిలీఫ్‌ లభించనుంది. గత ఏడాది 14 మంది రిమాండు ఖైదీలు, 16 మంది జీవిత ఖైదీలకు పెరోల్‌ లభించి బయటికి వెళ్లారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో మరోమారు వీరితో పాటు మరికొందరు కూడా బెయిలు, పెరోల్‌పై విడుదల కానున్నారు. అయితే కడప జిల్లా కేంద్ర కారాగారంలో 124 మంది రిమాండు ఖైదీలు, 543 జీవిత ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది జైలు సిబ్బంది ఖైదీలకు 300 మందికి పైగానే కరోనా పాజిటివ్‌ సోకి చికిత్స పొందారు. కాగా ప్రస్తుతం సెకండ్‌వేవ్‌ ఉధృతంగా ఉండడంతో మరోమారు ఖైదీలకు బెయిల్‌ లభించే అవకాశం ఉంది. జైలు అఽధికారులు మాత్రం తమకు ఇంకా నివేదిక రాలేదని, నేడో, రేపో నివేదిక అందిన వెంటనే ఖైదీలు, రిమాండు ఖైదీలను బెయిలుపై పంపనున్నట్లు పేర్కొంటున్నారు.

 

Updated Date - 2021-05-10T05:08:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising