ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కరోనా మరణాలు

ABN, First Publish Date - 2021-06-22T06:58:37+05:30

రాష్ట్ర ప్రభుత్వం కరోనాను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమైందని, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మరణాలు సంభవించాయని వీటన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి డిమాండ్‌ చేశారు. టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం బీటెక్‌ రవి, కడప పార్లమెంటు అధ్యక్షుడు లింగారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, కడప అసెంబ్లీ ఇనఛార్జ్‌ అమీర్‌బాబులు కలెక్టర్‌ హరికిరణ్‌ను కలిసి వినతిపత్రం అందించారు.

కలెక్టరుకు వినతిపత్రం అందిస్తున్న బీటెక్‌ రవి, లింగారెడ్డి, రెడ్యం తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆక్సిజన అందక చనిపోయిన వారికి రూ.25 లక్షలు

కరోనా మరణానికి రూ.10 లక్షలు ఇవ్వాలి

బీటెక్‌ రవి, లింగారెడ్డి డిమాండ్‌

కడప, జూన 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కరోనాను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమైందని, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మరణాలు సంభవించాయని వీటన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి డిమాండ్‌ చేశారు. టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం బీటెక్‌ రవి, కడప పార్లమెంటు అధ్యక్షుడు లింగారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, కడప అసెంబ్లీ ఇనఛార్జ్‌ అమీర్‌బాబులు కలెక్టర్‌ హరికిరణ్‌ను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం బీటెక్‌ రవి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఆక్సిజన అందక చాలామంది మరణించారన్నారు. అలాంటి వారికి రూ.25 లక్షలు ఇవ్వాలని, కరోనాతో మృతి చెందిన వారికి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పల్లెలు మొదలుకొని పట్టణాల వరకు చాలా వరకు కరోనాతో మృతి చెందినా ప్రభుత్వ లెక్కల్లో తేడాలున్నాయన్నారు. కరోనాతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తక్షణమే రూ.10 వేలు ఆర్ధికసాయం అందించాలని డిమాండ్‌ చేశారు. అలాగే రేషన కార్డు ఉన్న వారికి రూ.7500 ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వ్యాక్సినేషన త్వరగా పూర్తి చేయాలన్నారు. కడప పార్లమెంటు అధ్యక్షులు లింగారెడ్డి మాట్లాడుతూ మే నెలలోనే రాష్ట్రంలో లక్షా 35 వేల మంది కరోనాతో మృతి చెందినట్లు కేంద్రం చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 30 వేల మంది మాత్రమే మృతి చెందినట్లు చెబుతోందన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేసి రెండేళ్లయినా ఇంతవరకు రైతులకు డబ్బులు అందలేదన్నారు. పసుపు, శెనగ పంటలకు కనీస మద్దతు ధర లేదన్నారు. ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. పసుపు బకాయిలు కూడా చెల్లించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు శివకొండారెడ్డి, జయకుమార్‌, ఆమూరి బాలదాసు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T06:58:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising